Ram Charan Sukumar : రామ్ చరణ్ సుకుమార్ మూవీ - సుక్కూ ప్లాన్ వేరే లెవల్... బర్త్ డే రోజున బిగ్ సర్ప్రైజ్?
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ మూవీపై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా బర్త్ డే రోజున స్పెషల్ సర్ప్రైజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Sukumar Movie Story Locked : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇతర పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది.
'పెద్ది' తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చరణ్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
అదే సీన్ రిపీట్ అవుతుందా?
రామ్ చరణ్, సుకుమార్ మూవీ 'RC17' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుండగా... ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు తెలుస్తోంది. కథ లాక్ అయినట్లు టాక్ వినిపిస్తుండగా... ఏ జానర్‍లో మూవీ ఉంటుంది అనే దానిపై సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి.
సాధారణంగా సుకుమార్ మూవీస్ హీరో క్యారెక్టరైజేషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ 'ఆర్య' మూవీ నుంచి 'పుష్ప' వరకూ అలానే సాగింది. హీరో చుట్టూనే స్టోరీ అల్లుకుంటుంది. మరి రామ్ చరణ్ మూవీలో కూడా క్యారక్టరైజేషన్ కొత్తగా ఉండబోతుందోనంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఈసారి సుక్కూ మ్యాజిక్ చేయబోతున్నాడని చెబుతున్నారు. మరోవైపు, పీరియాడిక్ లేదా గ్రామీణ నేపథ్యంలో కూడిన డిఫరెంట్ స్టోరీ రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : సల్మాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ చేంజ్ - కొత్త టైటిల్ ఇదే... అసలు రీజన్ ఏంటో?
చరణ్ బర్త్ డే... డబుల్ ట్రీట్
నిజానికి చరణ్ బర్త్ డే సందర్భంగా 'పెద్ది' మూవీ ఈ నెల 27నే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలో ఆ రోజున టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే, చరణ్, సుకుమార్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అనే చెప్పాలి.
సుకుమార్ మూవీ విషయానికొస్తే... RC17 మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ను హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.
ట్రెండింగ్ వార్తలు





















