Maruthi: స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న 'ది రాజా సాబ్' దర్శకుడు... ఓదార్చిన ప్రభాస్
The Raja Saab Director Maruthi: 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన్ను ఓదార్చడానికి హీరో ప్రభాస్ స్టేజిపైకి వెళ్లారు.

Director Maruthi Speech At The Raja Saab Pre Release Event: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అభిమానులు (రెబల్స్), అలాగే ప్రేక్షకులు అందరినీ 'ది రాజా సాబ్' ఎంటర్టైన్ చేస్తుందని దర్శకుడు మారుతి చెప్పారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ఒక్క శాతం నిరాశ కలిగించినా తన ఇంటికి రమ్మని అడ్రస్ ఇచ్చారు. 'ప్రభాస్ (Prabhas)ను ప్రేమించే ఏ ఒక్కరు అయినా సరే మమ్మల్ని డిజప్పాయింట్ చేశావ్ అని ఫీల్ అయితే విల్లా నంబర్ 16, కొండాపూర్ ఏరియాలోని కొల్లా లగ్జోరియాకు రండి' అని పేర్కొన్నారు.
స్టేజిపై కన్నీళ్లు పెట్టుకున్న మారుతి
'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజి మీద ఎమోషనల్ అయ్యారు మారుతి. తన స్పీచ్ మధ్యలో కన్నీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా తాను చావులకు వెళ్లిన సమయంలోనూ కన్నీళ్లు పెట్టుకోనని, ఇదంతా సహజం అనుకుంటానని, అయితే మూడేళ్ళ నుంచి తనలో ఉన్న స్ట్రెస్ ఈ రూపంలో బయటకు వచ్చిందని మారుతి తెలిపారు. ఆయన ఎమోషనల్ అవ్వడంతో స్టేజిపైకి వెళ్లి ఓదార్చారు ప్రభాస్. అది ప్రేక్షకులను టచ్ చేసింది.
Also Read: 'స్పిరిట్' లుక్‌లో రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు... ప్రభాస్ పిలక చూశారా?

రాముడి గెటప్‌లో ప్రభాస్... మారుతికి ఛాన్స్!
మూడేళ్ళ క్రితం ముంబైలో 'ఆదిపురుష్' చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తాను వెళ్లానని, అప్పుడు రాముడి వేషధారణలో ప్రభాస్ ఉన్నారని, తనతో సినిమా చేసే అవకాశం ఈ మారుతి (హనుమంతునికి మరో పేరు మారుతి కదా)కి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు దర్శకుడు. ఆ రోజు ప్రభాస్‌ను బాగా నవ్వించానని, అది గుర్తు పెట్టుకుని తనకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు.
Also Read: గ్లామరస్ శారీలో నిధి అగర్వాల్... 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫోటోలు
'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిని గుర్తు చేసుకున్నారు మారుతి. తెలుగు హీరోని పాన్ ఇండియా స్టార్ చేశారని, నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ అని చెప్పారు. ఇంకా మారుతి మాట్లాడుతూ... ''నేను నా స్థాయిలో సినిమాలు తీసుకుంటూ వెళుతున్నాను. 11 సినిమాలు చేసిన నన్ను రెబల్ యూనివర్సిటీకి తీసుకు వెళ్లారు ప్రభాస్. నేను రాశాను, తీశాను. అయితే నా వెనుక ఉన్న శక్తి మామూలుది కాదు. హారర్ జానర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లారు. కొన్ని సీన్లు చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి. అంతటి నటన ఇచ్చిన ప్రభాస్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఖర్చుకు వెనుకాడకుండా ప్రొడ్యూస్ చేసిన టీజీ విశ్వప్రసాద్ గారికి కూడా'' అని చెప్పారు.
Also Read: మాళవిక మోహనన్ లుక్కు... 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిర్రాకు
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'ది రాజా సాబ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. సంజయ్ దత్, జరీనా వాహెబ్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు చేశారు.





















