India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
శ్రీలంకతో జరిగిన మూడో T20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు శ్రీలంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. చేజింగ్ లో టీమ్ ఇండియా 13వ ఓవర్‌లోనే మ్యాచ్ ను ముగించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సంపాదించింది భారత్. షెఫాలీ వర్మ 42 బంతుల్లో 79 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించింది.
ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్లు శ్రీలంక బ్యాట్స్‌మెన్ కు చుక్కలు చూపించారు. ఇండియా బౌలింగ్ ముందు లంక ప్లేయర్స్ నిలవలేకపోయారు. కేవలం 45 పరుగులకే శ్రీలంక 4 వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో శ్రీలంక కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రెండో ఇన్నింగ్స్ లో ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కేవలం ఒక పరుగుతో ఔట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ కూడా 9 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకుంది. మరోవైపు షెఫాలీ వర్మ విధ్వంసం సృష్టించింది. షెఫాలీ 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది. మహిళల T20 క్రికెట్ చరిత్రలో ఇది భారత్ తరపున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ.




















