Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Andhra Pradesh News | వైజాగ్ లో టూరిస్ట్ లకు ఉదయం నుంచే అన్ని మ్యూజియాలు అందుబాటులో ఉండాలని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ సిబ్బందికి సూచించారు.

Vizag News | విశాఖపట్నం: వైజాగ్ అంటేనే టూరిస్ట్ ప్లేస్ లకు పెట్టింది పేరు. వింటర్ సీజన్ తో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి హాలిడేస్ తోడవడం తో వైజాగ్ లోని టూరిస్ట్ ప్లేస్ లన్నీ కిటకిటలాడుతున్నాయి.ఇంత రద్దీ సీజన్ లోనూ అధికారులు రూల్స్ అంటూ విశాఖ లోని అనేక మ్యూజియంలను మధ్యాహ్నం నుండే తెరువడంపై VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ సీరియస్ అయ్యారు.
ఉదయం నుండే తెరవండి.. టూరిస్ట్ లకంటే రూల్స్ ఎక్కువ కాదు : ప్రణవ్ గోపాల్
పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. శనివారం ఉదయం బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటకులు ఎండలో బారులు తీరటాన్ని గమనించి, వారిని విశ్రాంతి గదిలో సేద తీరాలని సూచించారు. ఆదివారం మాత్రమే ఉదయం నుంచి తెరిచి ఉంచుతామని, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం నుంచి తెరుస్తామని అధికారులు చెప్పటంతో పర్యాటక సీజన్ కావటంతో అధిక సంఖ్యలో పర్యాటకులు బారులు తీరుతున్నారని, అందువల్ల VMRDA పరిధిలో అన్ని మ్యూజియంలను ఉదయం 10 గంటలనుంచే తెరవాలని ఆదేశించారు.

బీచ్ లో మెయిన్ ఎట్రాక్షన్ కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం బయట పర్యాటకులు బారులు తీరుతున్న నేపథ్యంలో వారిని అదుపు చేయడానికి క్యూ లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు రోప్ లని ఉపయోగించాలని సూచించారు. అలానే టూరిస్ట్ ప్లేసుల్లో టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచాలని, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని మ్యూజియంల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. బీచ్ రోడ్ లో పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.. అన్ని పర్యాటక ప్రాంతాల్లో రక్షిత తాగు నీటిని అందుబాటులోకి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీ కృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వైజాగ్ లో బోలెడన్ని టూరిస్ట్ ప్లేస్ లు
వైజాగ్ లో చాలా టూరిజం ఎట్రాక్షన్స్ ఉన్నాయి. నేచురల్ బ్యూటీ స్పాట్స్ తో పాటు కురుసురా సబ్ మెరైన్ మ్యూజియం, నేవీ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, TU 142 విమానం మ్యూజియం, సీ హారియర్ మ్యూజియం లతో పాటు క్రొత్తగా మాయా వరల్డ్, కైలాస గిరి, గ్లాస్ బ్రిడ్జ్, రోప్ వే లాంటి అనేక ఎట్రాక్షన్స్ టూరిస్ట్ లను ఆకట్టు కుంటున్నాయి. పండుగ సీజన్లో వాటి రద్దీ పెరగడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడానికి VMRDA రెడీ అయింది. ఇందులో భాగంగానే ఉదయం నుండే మ్యూజియంలు అన్నీ తెరిచి ఉంచుతున్నారు.





















