అన్వేషించండి

Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

Andhra Pradesh New Districts: ఏపీలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు

Final notification on new districts and divisions in AP on December 31:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా చేపట్టిన జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి   నారా చంద్రబాబు నాయుడు  అమరావతిలో మంత్రులు,ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత నెల 27న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ సమీక్ష జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల సరిహద్దులు, కొత్త డివిజన్లు,  మండలాల ఏర్పాటుపై ప్రభుత్వానికి మొత్తం 927 అభ్యంతరాలు, వినతులు అందాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువు నేటితో ముగియడంతో, అందిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు, ప్రజల సౌకర్యం, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యంతరాలను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.                                 

ఈ పునర్విభజన ప్రక్రియ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే. గతంలో జరిగిన విభజనలో కొన్ని చోట్ల ప్రజలకు జిల్లా కేంద్రాలు దూరం కావడం, మరికొన్ని చోట్ల భౌగోళిక వైరుధ్యాలు ఉండటంతో, ప్రస్తుత ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోయే డివిజన్లు ,  మండలాల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం అనంతరం, అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి  డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్  విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1 నుండి కొత్తగా ఏర్పాటైన జిల్లాలు లేదా డివిజన్లు పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.   పునర్విభజన కేవలం కాగితాల మీద మార్పు కాదని, ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుది నోటిఫికేషన్ వెలువడే వరకు ఎక్కడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను కోరారు.    

 
గతంలో విడుదల చేసిన  ప్రాథమిక నోటిఫికేషన్‌లోని  పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  10 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.  కొన్ని మండలాలను ఒక డివిజన్ నుండి మరొక డివిజన్‌కు, మరికొన్నింటిని ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మార్చారు.  జిల్లా కేంద్రం చాలా దూరంగా ఉన్న మండలాలను, ప్రజల కోరిక మేరకు దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రానికి అనుసంధానించేలా సరిహద్దులను సవరించారు. నెల్లూరు, గూడులు సహా పలు చోట్ల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా మార్చినట్లుగా తెలుస్తోంది. తుది నోటిఫికేషన్ తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.                    

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget