జీమెయిల్ యూజర్లు యూజర్ నేమ్ మార్చుకోవాలంటే పాతది వదిలేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Published by: Raja Sekhar Allu

న్న అకౌంట్‌లోనే ఐడీని మార్చుకోవచ్చు..ఐడీ మార్చుకున్నా.. మీ పాత మెయిల్స్, కాంటాక్ట్స్, గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఏవీ డిలీట్ అవ్వవు.

Published by: Raja Sekhar Allu

ఐడీ మార్చుకున్న తర్వాత ఎవరైనా మీ పాత అడ్రస్‌కు మెయిల్ పంపినా, అది మీ కొత్త ఇన్-బాక్స్‌కే వస్తుంది.

Published by: Raja Sekhar Allu

మీరు మీ పాత ఐడీతోనైనా లేదా కొత్తగా మార్చుకున్న ఐడీతోనైనా గూగుల్ సర్వీసుల్లోకి (YouTube, Drive, etc.) లాగిన్ అవ్వొచ్చు.

Published by: Raja Sekhar Allu

ఒకసారి మీరు జీమెయిల్ ఐడీని మార్చుకుంటే, మళ్లీ దానిని మార్చడానికి లేదా డిలీట్ చేయడానికి 12 నెలల పాటు వేచి చూడాలి.

Published by: Raja Sekhar Allu

ఒక యూజర్ తన జీవితకాలంలో గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఐడీని మార్చుకునే వీలుంటుంది

Published by: Raja Sekhar Allu

మీరు ఐడీ మార్చుకున్నా, మీ పాత ఐడీ గూగుల్ వద్దే రిజర్వ్ అయి ఉంటుంది. దానిని వేరే వాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి వీలుండదు.

Published by: Raja Sekhar Allu

ఫీచర్‌ను గూగుల్ మొదటగా భారతదేశంలోనే ప్రయోగాత్మకంగా విడుదల చేసే అవకాశం ఉంది

Published by: Raja Sekhar Allu

మొదట్లో సరదాగా క్రియేట్ చేసుకున్న మెయిల్ఐడీలతో ఇబ్బంది పడేవారికి, తమ ఐడీని ప్రొఫెషనల్ పేరుగా మార్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం.

Published by: Raja Sekhar Allu

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లో Personal Info > Email > Change Email Address సెక్షన్ ద్వారా మార్చుకోవచ్చు.

Published by: Raja Sekhar Allu