Janhvi Kapoor: ఫ్యాషన్ వీక్‌లో అందాల నటి జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్ - నెటిజన్ల ట్రోలింగ్స్
Lakme Fashion Week: లాక్మే ఫ్యాషన్ వీక్‌లో నటి జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

Trollings On Janhvi Kapoor's Ramp Walk In Lakme Fashion Week: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో (Lakme Fashion Week) తన గ్లామర్, బోల్డ్ లుక్‌తో కుర్రకారును అలరించింది. ముంబయిలోని జియో కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ఎంతోమంది మోడల్స్, సెలబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొన్నారు.
బ్యూటీ లుక్‌తో..
ఈ ఫ్యాషన్ షోలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ర్యాంప్ వాక్‌తో సందడి చేసింది. డీప్ నెక్ బాడీ కాన్ డ్రెస్‌లో బోల్డ్ లుక్స్‌తో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా బ్రాండ్ కోసం జాన్వీ ర్యాంప్‌పై సందడి చేస్తూ.. ఆయన డిజైన్ చేసిన దుస్తుల్లో ఇతర మోడల్స్‌తో కలిసి తళుక్కున మెరిశారు. అంతటితో ఆగకుండా ఫోటోలకు అదిరిపోయే ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. జాన్వీ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న 'పెద్ది' మూవీలో నటిస్తున్నారు.
నెటిజన్ల ట్రోలింగ్
అయితే, జాన్వీ ర్యాంప్ వాక్‌పై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె తీరును ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. 'ఆమె ఎందుకు అంతలా పరిగెడుతున్నారు?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ అలా చేయడం కామన్ అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరోవైపు.. నటి తమన్నా, కరీనాకపూర్ సైతం ఈ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేశారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. నటి కరీనా కపూర్ కూడా లాక్మే ఫ్యాషన్ వీక్ 25 ఏళ్ల సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ బ్రాండ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల విరామం తర్వాత తిరిగి ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని కరీనా అన్నారు.
'నా మనసుకు నచ్చిన విధంగా నేను నడుచుకుంటాను. జీరో సైజ్‌తో ర్యాంప్ వాక్ చేసినా.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేసినా.. ఇప్పుడు ఇలా వచ్చినా అంతా నా ఇష్టప్రకారం నా ఆనందంతో చేసిందే. నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా. ఇలాంటి అవకాశం ఇచ్చిన లాక్మే సంస్థకు ధన్యవాదాలు.' అని కరీనా తెలిపారు.





















