Viral News: ధ్యానంలోనే సజీవ సమాధి అయ్యేందుకు ఉగాది నాడు వ్యక్తి ప్రయత్నం, పోలీసుల రాకతో మారిన సీన్
ధ్యానం చేసుకుంటూ సజీవ సమాధి కావాలని ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోసారి ప్రయత్నించడంతో కుటుంబసభ్యులు వారించి అతడి ప్రయత్నాన్ని ఆపేశారు.

గత వారం రోజులుగా ధ్యానం చేస్తున్న ఒక వ్యక్తి సజీవ సమాధికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత మళ్లీ వెళ్లి గొయ్యి లోపల కూర్చున్న వ్యక్తి కుటుంబ సభ్యులు చెప్పడంతో బయటకు వచ్చాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఈ విచిత్ర ఘటన జరిగింది. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యక్తి సజీవ సమాధి రత్నంపై చర్చ జరుగుతుంది.
అసలు ఏం జరిగిందంటే..
విఠలాపురం గ్రామ మాజీ సర్పంచ్ కైపు అంజిరెడ్డి కుమారుడు కైపకోటిరెడ్డి దశాబ్దం కిందట ఊరి చివరన ఆలయం కట్టించాడు. తమ పొలంలోనే భూదేవి ఆలయాన్ని కోటిరెడ్డి వ్యక్తిగత ఖర్చులతో సొంతంగా నిర్మించాడు. ఆలయం ముందు గొయ్యి తీసి వారం రోజులుగా అందులో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది పండుగ రోజు సంజీవ సమాధి కావాలని కోటిరెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఐదు గంటలకు తన కుమారుడితో కలిసి ఆలయానికి చేరుకొని కోటిరెడ్డి ప్రత్యేక పూజలు చేశాడు. పూజల అనంతరం పెద్ద గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. తండ్రి కోటిరెడ్డి చెప్పినట్లుగా కుమారుడు గోబీ మీద ఉంచిన పెద్ద రేకు మీద మట్టి పోసి పొడిచాడు.. గ్రామస్తుల నుంచి విషయం తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అక్కడికి చేరుకొని తొలగించి బయటికి రావాలని కోరాడు. తాను ధ్యానంలో ఉన్నానని ఎవరు తనకు ఆటకం కలిగించవద్దని కాయపు కోటిరెడ్డి బదులిచ్చాడు.
గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విఠలాపురం గ్రామస్తుల సహాయంతో పోలీసులు కోటిరెడ్డి నుంచి బయటకు తీశారు. అతడి సజీవ సమాధి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అంతా బానే ఉందనుకుంటే కోటిరెడ్డి మరోసారి గొయ్యిలోకి దిగి తిరిగి ధ్యానం మొదలు పెట్టాడు. కోటిరెడ్డి తండ్రి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మధ్యాహ్నం మరోసారి ఆలయం వద్దకు వచ్చారు. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని తమ మాట విని బయటికి రావాలని రిక్వెస్ట్ చేశారు. పరుగు దగ్గరే ఉండి పదేపదే అడగడంతో దగ్గరకు కోటిరెడ్డి ఉదయం నుంచి బయటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. దాంతో గ్రామంలో ఉగాది పండుగ నాడు హై డ్రామా ముగిసింది






















