Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
Vizag Latest News: భర్తపై అలిగిన ఓ భార్య విశాఖ పోలీసులను పరుగులు పెట్టించింది. ఐదు వందలు ఇవ్వలేదని బిల్డింగ్‌పై నుంచి దూకుతానని బెదిరించింది.

Vizag Latest News: విశాఖలో ఓ మహిళ చేసిన పనికి పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య ఆత్మహత్యకు యత్నించింది. బిల్డింగ్‌పై నుంచి దూకుతానంటూ బెదిరించింది. విషయం తెలుసుకున్న పోలీసులు పరుగుపరుగు వెళ్లి ఆమెను రక్షించారు. భార్యభర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
విశాఖలోని మధురవాడలోని పీఎం పాలెం భార్యభర్త మధ్య గొడవ జరిగింది. ఆమె ఐదు వందల రూపాయులు అడిగితే ఇవ్వలేదని భర్తపై అలిగింది. అంతే తనను సరిగా చూసుకోవడం లేదని రోడ్డెక్కింది. తనకు గౌరవం లేని చోట ఉండలేనంటూ ఆత్మహత్యాయత్నం చేసింది.
భార్యభర్త ఉంటున్న బిల్డింగ్‌లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరించింది. స్థానికులు ఎంతగా ప్రయత్నించినా ఆమె మాట వినలేదు. దూకుతానంటూ అందర్నీ బెదరగొట్టేసింది. భర్త కలుగుజేసుకున్నా వినిపించుకోలేదు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెతో మాట్లాడారు. బిల్డింగ్‌పై ఉన్న ఆమెను కిందికి దించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ముందు జాగ్రత్తగా నెట్ కూడా ఏర్పాటు చేశారు.
ఓవైపు ఆమెతో మాట్లాడుతూనే మరోపక్క నుంచి బిల్డింగ్‌పైకి చేరుకున్నారు. చాలా సమయం తర్వాత ఆమెను పట్టుకొని కింద పడకుండా పట్టుకున్నారు. కిందికి దించి స్టేషన్‌కు తరలించారు. భర్త భార్య ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి రిపీడ్ చేయొద్దని హెచ్చరించారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. రీల్స్ ప్రభావమో లేక ఇంకా వేరే కారణాలో తెలియదు కానీ సహనం నశిస్తోంది. అనుకున్న వెంటనే అన్నీ అయిపోవాలనే ఆలోచన పెరుగుతోంది. దీని కారణంగానే కుటుంబంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చాలా మంది దంపతుల మధ్య విభేదాలు వస్తున్నాయి. విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు.
భర్త సరిగా చూసుకోవడం లేదని భార్య ఫిర్యాదు చేసింది. భర్త కూడా భార్యపై ఫిర్యాదు చేశాడు. ఇద్దరి గురించి తెలుసుకున్న పోలీసులు వారికి క్లాస్ తీసుకున్నారు. ఇకపై ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వారి పెద్దల్ని కూడా పిలిచి సర్ది చెప్పాలని హితవు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

