Andhra Pradesh Latest News:ఏపీలో లోకల్ రాజకీయ రచ్చ - పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో ఖాళీ అయిన లోకల్ బాడీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పదవులు దక్కించుకునేందుకు పార్టీలు పోటీ పడటంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో పలు ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్ పదవులు, ఎంపీటీసీలు ఖాళీ అయ్యాయి. వాటిని కైవశం చేసుకునేందుకు ఓవైపు కూటమి నేతలు ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డుకొని లోకల్‌గా పై చేయి సాధించాలని వైసీపీ యత్నించింది. అందుకే ఇరు వర్గాల మధ్య నెలకొన్న పోటీ కారణంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ తోపాటు కర్నూలు జెడ్పీ కో–ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక, 60 మండలాల్లో 28 ఎంపీపీ పదవులు, 23 మండల ఉపాధ్యక్ష, 12 మండల కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక నేడు జరుగుతోంది. ఇందులో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. ఈ నెల 18న వీటి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 200 గ్రామ పంచాయతీల్లోనూ ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది.
ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక సంస్థల్లో కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటం, రాజీనామాలు చేస్తుండటంతో లోకల్ రాజకీయాలు కాకాపుట్టిస్తున్నాయి. తమ పార్టీలో చేరినందున వాటిని కైవశం చేసుకునేందుకు కూటమి పార్టీలు యత్నిస్తుంటే మందబలంతో ఇలా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి లోకల్‌గా మాత్రం పలు చోట్ల ఉద్రక్తతలు చోటు చేసుకున్నాయి.
కడప జడ్పీ వైసీపీదే
కడప జడ్పీ చైర్మన్‌గా వైసీపీ నేత రాంగోవింద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడదుల చేశారు. ఈ స్థానంపై రెండు మూడు రోజుల నుంచి ఉత్కంఠ నెలకొంది. బలం లేకపోయినా పార్టీ మారిన సభ్యులతో తమకు ఛైర్మన్ పదవి దక్కుతుందని టీడీపీ భావించింది. కానీ మెజార్టీ వైసీపీ వైపు ఉండటంతో వాళ్లకు ఏకగ్రీవమైంది.
వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ పరిధిలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 49 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యేగా తర్వాత ఎన్నికయ్యారు దీంతో జెడ్పీ చైర్మన్ కోసం పోటీ పడ్డాయి. కానీ వైసీపీ దీన్ని కైవశం చేసుకుంది.
పశ్చిమ గోదావరిలో ఉద్రిక్తత
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి ఇంటి ముట్టడికి కూటమి నేతలు వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు కూటమి నేతలను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
వైసీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇలా అడ్డుకోవడం ఏంటని వైసీప నేతలు ప్రశ్నించారు. ఎన్నిక ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మొత్తం 18 మంది ఎంపీటీసీలకు గాను వైసీపీ-14, టీడీపీ-2, జనసేన-2 బలం ఉంది. కొందరు పార్టీ మారడంతో ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ యత్నిస్తోంది. అందుకే ఇక్కడ రాజకీయం హీటెక్కింది.
పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ పదవిపై కూడా టీడీపీ గురిపెట్టంది. అయితే ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఫ్యామిలీని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అచ్చంపేటలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 16 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా ఒక స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ ఎంపీపీగా భూక్యా రజనీబాయి 2024 ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. కూటమి గెలవడంతో చాలా మంది ఎంపీపీ సభ్యులు పార్టీ మారారు. దీంతో ఈ స్థానం విజయం సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక కూడా వివాదం అవుతోంది. బుధవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు. రాడ్లు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాల వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. వైసిపి వాహనాల్లో మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
రామగిరి ఎంపీపీ నాగమణి మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నేటి ఎన్నిక కోసం రామగిరి ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో వైసిపి నేతలు, టిడిపి నేతలు వారి పార్టీలకు అభ్యర్థులకు పత్రాలు సమర్పించేదుకు వచ్చిన తరుణంలో ఘరన జరిగింది. దీంతో పోలీసులు రామగిరి మండలంలో 144 సెక్షన్ అమలు చేస్తున్‌నారు.
నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీ కోసం కూడా పోటీ నెలకొంది. వైసీపీకి చెందిన 14 ఎంపీటీసీల్లో 8 మంది పార్టీ మారారు. అందుకే దీనిపై టీడీపీ కన్నేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

