ఐపీఎల్ మహా సంగ్రామం మొదలైంది. అన్ని జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడేశాయి. ఈ టీ20 యుద్ధంలో ఇషాన్ కిషన్, అశుతోష్ శర్మ, శ్రేయస్ అయ్యర్ దుమ్ము లేపి దంచికొట్టారు. రేపో మాపో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల లిస్ట్ రానుంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు కాంట్రాక్టు దక్కుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.