Quinton de Kock 97 vs RR IPL 2025 | ఐపీఎల్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డికాక్ | ABP Desam
ఫామ్ ఈజ్ టెంపరరీ..క్లాస్ ఈజ్ పర్మినెంట్ అంటారు కదా క్రికెట్ లో ఎక్కువగా. హియర్ ఈజ్ ద ఎగ్జాంపుల్. క్వింటన్ డికాక్. ఐపీఎల్ లో ఓపెనర్ గా విధ్వసంకర ఇన్నింగ్స్ లు ఆడిన డికాక్ గడచిన రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడ్డాడు. తనను బాగా నమ్మిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా నమ్మకం కోల్పోయి వదిలేసిన టైమ్ లో తనకు అవకాశం ఇచ్చి మరో ఛాన్స్ ఇచ్చిన కోల్ కతా నైట్ రైడర్స్ రుణం తీర్చేసుకున్నాడు క్వింటన్ డికాక్. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 152పరుగుల టార్గెట్ చేజ్ చేసే క్రమంలో తన లోని వింటేజ్ డికాక్ ను చూపించాడు. 61 బాల్స్ లో 8 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 97పరుగులు చేసి నాటౌట్ గా నిలవటమే కాదు తన ఫామ్ పై పెదవి విరుస్తున్న విమర్శకులకు చెక్ పెట్టాడు డికాక్. కీపింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు. పరాగ్ ఇచ్చిన క్యాచ్ ను హెల్మెట్ తీసి విసిరేసి మరీ క్యాచ్ పట్టుకున్న తీరు హైలెట్ అసలు. 2021 లో టెస్టుల నుంచి, 2023లో వన్డేల నుంచి చిన్న వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్..2024 తర్వాత సౌతాఫ్రికా కు మళ్లీ ఆడను కూడా లేదు. ఫామ్ కోల్పోయి 2023, 2024 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కి భారంగా మారిన డికాక్ ను LSG మొన్న ఆక్షన్ లో వదిలించుకున్నా 2019-2022 మధ్య నాలుగేళ్లలో మూడు సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన డికాక్ ను కేకేఆర్ నమ్మి 3కోట్ల 80లక్షలకు కొనుక్కుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా డికాక్ కమ్ బ్యాక్ ఇచ్చిన తీరు అప్పోనెంట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను ఇంప్రెస్ చేసింది. అందుకే నడిచే పరిస్థితిలో లేకున్నా వాకింగ్ స్టిక్ తో వచ్చి మరీ మ్యాచ్ అవ్వగానే డికాక్ ను ప్రత్యేకంగా అభినందించాడు. ఇక హెట్మెయర్ అయితే అప్పోనెంట్ టీమ్ అన్న విషయాన్ని మర్చిపోయి మరీ హగ్ చేసుకున్నాడు. అదీ ఓ క్వాలిటీ ఆటగాడి కమ్ బ్యాక్ ను మిగిలిన టీమ్ లు ఎంజాయ్ చేయటం అంటే.





















