Riyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam
విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ ప్రజెంట్ ఐపీఎల్ లో హయ్యెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్లు. వీళ్ల కోసమే మ్యాచ్ లకు వచ్చే అభిమానులు వాళ్లను ఓసారి చూడాలని కుదిరితే ఫోటో దిగాలని తెగ ఆరాటపడుతుంటారు. అయితే కొంత మంది అభిమానులు మాత్రం దాన్ని మరింత పై లెవల్ కి తీసుకువెళ్తారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు గేట్లు దూకేసి గ్రౌండ్ లోకి వెళ్లి ఆ యా క్రికెటర్ల కాళ్లు మొక్కే సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. ఇది చట్టరీత్యా, భద్రతా పరంగా తప్పు. కానీ అభిమానులు తమ ఉద్రేకాన్ని ఆపుకోలేక చాలా సార్లు ఇలా చేస్తూ ఉంటారు. నిన్న కూడా ఓ అభిమాని సెక్యూరిటీని బ్రీచ్ చేసుకుంటూ గ్రౌండ్ లోకి వెళ్లి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కాళ్లకు దణ్ణం పెట్టాడు. పరాగ్ ను హగ్ చేసుకున్నాడు. పరాగ్ కూడా ఒక్క నిమిషం షాకయ్యాుడు. ఈలోగా భద్రతా సిబ్బంది వచ్చి ఆ అభిమానిని బయటకు తీసుకువెళ్లిపోయారు. దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. రెండు మ్యాచ్ లు ఆడి కెప్టెన్ గా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన పరాగ్ గాడి కాళ్లు పట్టుకునేందిరా బ్యాటింగ్ లో కూడా వాడు చేసింది ఏముంది అంటూ పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి నిన్న మ్యాచ్ జరిగింది గువహాటిలో. అది అస్సాం క్రికెట్ కు పురిటిగడ్డ. రాజస్థాన్ రాయల్స్ తన సెకండ్ హోమ్ ఇటీవల కాలంలో గువహాటిలో మ్యాచ్ లు ఆడుతూ అస్సాం క్రికెట్ ను ప్రోత్సహిస్తోంది. ఇక అస్సాం నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు ఎదిగిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉండగా ఐపీఎల్ ఆడి కాస్త స్టార్ స్టేటస్ తెచ్చుకున్న మొదటి వ్యక్తి రియాన్ పరాగే. అస్సాం బిహూ డ్యాన్స్ కూడా వేస్తూ మ్యాచ్ ల మధ్యలో జోష్ తీసుకురావటం ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చాడు పరాగ్. అలాంటి పరాగ్ తమ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన వ్యక్తికి అభిమానులు ఉండటంలో తప్పేముంది. రెండు మ్యాచ్ లు ఓడిపోయినంత తర్వాత తను క్రికెట్ లో ఎదిగిన విధానం ఆదర్శం కాకుండా ఉంటుందా అనేది మరో వాదన. అందుకే ఏ కొహ్లీ, ధోనిల కాళ్లే పట్టుకోవాలా రియాన్ పరాగ్ కి ఫ్యాన్స్ ఉండకూడదా కౌంటర్ పోస్టులు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్.





















