అన్వేషించండి
YSRCP Yuvatha Poru: విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం వైసీపీ పోరుబాట- యువత పోరులో పాల్గొన్న నేతలు, పార్టీ శ్రేణులు
YSRCP Yuvatha Poru:
విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం వైసీపీ పోరుబాట- యువత పోరులో పాల్గొన్న నేతలు, పార్టీ శ్రేణులు
1/22

విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా ఇతర సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది.
2/22

యువత పోరు బాట పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
3/22

డీఎస్సీపై మొదటి సంతకమని ఊదరగొట్టిన చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
4/22

ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు.
5/22

రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
6/22

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ చేసే వాళ్లమని పేర్కొన్నారు.
7/22

ఐదేళ్లలో విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు.
8/22

గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా జగన్ మోహన్ రెడ్డి 2019లో ఇచ్చారని గుర్తు చేశారు.
9/22

ఐదేళ్లలో విద్యార్థులకు వివిధ పథకాల ద్వారా రూ.18,663.44 కోట్ల మేర లబ్ధి కలిగించామని వైసీపీ నేతలు వెల్లడించారు.
10/22

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆరోపించారు
11/22

పదివేల వేతనం ఇస్తామని చెప్పి వలంటీర్లను నడిరోడ్డున పడేశారని మండిపడ్డారు.
12/22

డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం అని చెప్పిన చంద్రబాబు 9 నెలలు అవుతున్నా ఇంత వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు.
13/22

16,347 పోస్టులను గత డిసెంబర్‌లోనే భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకో మాట చెబుతున్నారని ఆరోపించారు.
14/22

ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి కూటమి నేతలు ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించడం లేదని అన్నారు.
15/22

చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడల్లా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంటారని ఆరోపించారు.
16/22

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేకంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
17/22

బడ్జెట్‌లో అలాంటి వాటికి కనీసం నిధులు కూడా కేటాయించిన పాపాన పోలేదని ఆరోపించారు.
18/22

చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వైసీపీ కేడర్ ఈ ఆందోళనలతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు.
19/22

వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలంతా రోడ్లపైకి వచ్చారు.
20/22

భారీ సంఖ్యలో ర్యాలీలు తీసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
21/22

వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలు గురించి ప్రస్తావించారు.
22/22

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 13న రైతు పోరు.. విద్యుత్ ఛార్జీల పెంచుతున్నారని డిసెంబర్ 27న విద్యుత్ పోరు చేపట్టింది.
Published at : 12 Mar 2025 10:07 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















