Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Jobs In Grok: ఎలోన్ మస్క్ xAIలో బ్యాక్ ఎండ్ ఇంజనీర్‌గా పనిచేయడానికి కంప్యూటర్ ఇంజనీర్లను నియమిస్తోంది. Grok AI చాట్‌బాట్‌లో పని చేసే ఛాన్స్ ఇస్తోంది.

Jobs In Grok: ఎలాన్ మస్క్‌తో పని చేయాలనుకునే వాళ్లకు అద్భుత అవకాశం కల్పిస్తోంది xAI కంపెనీ. ఆ కంపెనీ ఒక బ్యాక్‌ఎండ్ ఇంజనీర్ కోసం వెతుకుతోంది. ఈ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన గ్రోక్ ఏఐ చాట్‌బాట్ కోసం ఈ నియామకం చేపట్టనున్నారు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఇతర వివరాలను ఎక్స్ తన అకౌంట్‌లో పోస్టు చేసింది. కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ఇంజనీర్ Igor Babuschkin ఈ పోస్టును రీపోస్టు చేశారు. ఏఐపై xAI మాత్రమే నిజంగా దృష్టి పెడుతున్న మస్క్ కూడా చెప్పుకొచ్చాడు.
ఈ పోస్టుకు ఎంపికైన వ్యక్తి బ్యాక్‌ఎండ్ ఇంజనీర్ టీంలో వర్క్ చేస్తాడు. ప్రోడక్ట్ పని తీరు, క్రెడిబిలిటీ, స్కేలబిలిటీని నిర్వహించడంపై పనిచేస్తాడని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యోగి కొత్త AI ప్రోడక్ట్స్ నమూనాలను ప్రారంభించడంలో రీసెర్ట్ టీంకు సహాయం చేస్తాడు. ఈ ఇంజనీర్ అధిక-పనితీరు గల రస్ట్ మైక్రోసర్వీసులు రూపొందించడం, రాయడం, నిర్వహిస్తాడు. ఇది బ్యాక్‌ఎండ్‌కు సంబంధించిన సమస్యలపై వర్క్ చేస్తుంది.
We're looking for outstanding backend engineers to help keep Grok performant and reliable. Come work with the best team on the planet!https://t.co/0TdRXNircg
— Ehsan Ghandhari (@phroo) March 24, 2025
ఈ ఉద్యోగం కోసం అప్లై చేసే వాళ్లకు కంప్యూటర్ సైన్స్‌లో గట్టి పట్‌టు ఉండాలి. పైథాన్, రస్ట్, కుబెర్నెట్స్, స్కాలాలో మంచి నైపుణ్యం ఉండాలి. ఈ పనిలో అనుభవం ఉన్న ఇంజనీర్‌కు ప్రాధాన్యత ఇస్తామని ఎక్స్ పేర్కొంది. .
ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా ఉంటుంది?జీతం ఎంత ఇస్తారు?
ఈ ఉద్యోగం కోసం ఎంపిక ప్రక్రియలో లాగ్ ప్రోసెస్ ఉంటుందని ఎక్స్ తెలిపింది. క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మొదట 15 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలో విజయవంతమైన అభ్యర్థి నాలుగు వేర్వేరు టెక్నికలల్ రౌండ్స్‌లో ఇంటర్వ్యూ చేస్తారు. ఇందులో కోడింగ్ అసెస్‌మెంట్, ప్రాక్టికల్ స్కిల్స్ మొదలైనవి చూస్తారు. ఈ పోస్ట్ కోసం కంపెనీ సంవత్సరానికి 1.4 కోట్ల నుంచి 3.6 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తోంది.
కంపెనీ గురించి మస్క్ చెప్పిన విషయం
ఈ ఉద్యోగం కోసం Igor Babuschkin పోస్ట్‌ను రీపోస్ట్ చేసిన మస్క్... xAI ప్రపంచంలోని ఏకైక పెద్ద AI కంపెనీ అని చెప్పుకొచ్చారు. నిజంపై మాత్రమే దృష్టి పెడుతున్నట్టు వివరించారు. నిజానికి కట్టుబడి ఉండటం మాత్రమే సురక్షితమైన AIని సృష్టించడానికి కారణమన్నారు. దీని వల్ల విశ్వం అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోగలమని తెలిపారు.
అప్లై చేయాలనుకుంటే ఈ లింక్పై క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

