అన్వేషించండి
Pawan Kalyan News: ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -వైవిధ్యంగా డీసీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్
Pawan Kalyan Latest News: ఉపముఖ్యమంత్రి పవన్ ఢిల్లీ పర్యటన గతానికి కంటే భిన్నంగా సాగింది. ప్రధానమంత్రి సహా మంత్రులతో సమావేశమైన కీలకాంశాలు చర్చించారు. పర్యటన చివరిలో కూటమి ఎంపీలకు విందు ఇచ్చారు.

ప్రతి అడుగు వ్యూహాత్మక ఎత్తుగడ -
1/27

మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధానమంత్రితోపాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు.
2/27

రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయానికి కృతజ్ఞతలు చెబుతూనే మరింత సాయం కోసం వారిని అభ్యర్థించారు.
3/27

పర్యటన ముగించిన తర్వాత చివరి రోజు కూటమి ఎంపీలకు పవన్ కల్యాణ్ విందు ఏర్పాటు చేశారు.
4/27

ఢిల్లీలో పవన్ ఇచ్చిన విందుకు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలతోపాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు హాజరయ్యారు.
5/27

కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, గిరిరాజ్ కిషోర్, అనురాగ్ ఠాకూర్, రాజీవ్ ప్రతాప్ రూఢీ హాజరయ్యారు
6/27

ఈసారి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన చాలా భిన్నంగా కనిపించింది. ఏ మంత్రి వద్దకు వెళ్లినా ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా చూశారు.
7/27

ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలన్నింటిలో కూడా మహాయుతి విజయం సాధించింది.
8/27

మహారాష్ట్ర విజయంలో పవన్ కల్యాణ్ పాత్ర చాలా ఉందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.
9/27

అందుకే ఆ ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకమైన లీడర్‌గా గుర్తింపు ఇచ్చి సాదర స్వాగతం పలుకుతోంది.
10/27

పవన్ కల్యాణ్ ఎత్తుకున్న సనాతమ ధర్మ పరిరక్షణ అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది.
11/27

ప్రధానమంత్రి, మంత్రులతో సమావేశం తర్వాత కూడా సనాతన ధర్మం, హిందువులపై జరుగుతున్న దాడులను పవన్ ప్రస్తావించారు.
12/27

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలన్న పవన్ ఐక్యంగా ఇలాంటి వాటిని ఎదుర్కోవాలని సూచించారు.
13/27

బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతీయుల కృషి, సైన్యం చిందించిన రక్తాన్ని మర్చిపోయి నేడు దాడులు చేయడ ఆవేదన కలిగిస్తుందన్నారు పవన్
14/27

భారత దేశంలో కుల మతాల మధ్య ఉన్న సక్యత బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లో ఎప్పుడూ కనిపించలేదని అన్నారు పవన్ కల్యాణ్
15/27

పాలస్తీనా, అరబ్ దేశాల్లో సమస్య వచ్చినప్పుడు ప్రపంచమంతా ఏకమై బలంగా నిలుస్తుందని... విదేశాల్లో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎఁదుకు స్పందించడం లేదని ప్రశ్నించారు పవన్
16/27

ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు జోక్యం చేసుకొని హిందువుల భద్రతపై మాట్లాడాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్
17/27

జల్‌జీవన్ మిషన్ పథకాన్ని సక్రమంగా నిర్వహించి ఇంటింటికీ మంచినీళ్లు అందివ్వాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీకి అన్నారు పవన్ వివరించారు.
18/27

గత ప్రభుత్వ హయాంలో ఈ జల్‌జీవన్ మిషన్ పథకం నిధులు పక్కదారి పట్టించారని ఇకపై అలా జరగదని మోదీకి పవన్ భరోసా ఇచ్చారు.
19/27

ఈ జల్‌జీవన్ మిషన్ పథకం అమలు కోసం కేంద్రం నుంచి సహకారం అందివ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశారు.
20/27

గ్రామీణ ప్రజలకు కుళాయి నీరందించే జల్‌జీవన్ మిషన్ పథకం అమలులోని సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి పవన్ తీసుకెళ్లారు.
21/27

కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి భూపేందర్ యాదవ్‌తో కూడా పవన్ సమావేశమై ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల అంశం గురించి చర్చించారు.
22/27

అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ-వేలంలో మెరుగైన ఫలితాల కోసం అమ్మకాలు, ఎగుమతల పర్యవేక్షణ కోసం సింగిల్ విండో విధానం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
23/27

కేంద్రం ఏర్పాటు చేసే సింగిల్ విండో విధానానికి ఏపీ అటవీశాఖ కస్టోడియన్‌గా ఉంటుందని కేంద్రమంత్రికి పవన్ తెలియజేశరు.
24/27

ఈ విధానం ద్వారానే ఎర్ర చందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి కార్యక్రమాలన్నీ చేపట్టాలని సూచించారు.
25/27

ఇలాంటి విధానంతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని వివరించారు.
26/27

ఎర్రచందనం ఏపీలో తప్ప ఎక్కడా దొరకదని కానీ వేర్వేరు రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం వాళ్లు అమ్ముకుంటున్నారని అన్నారు. దీని వల్ల ఏపీ నష్టపోతుందని వాపోయారు.
27/27

సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తే విదేశాల్లో ఎర్ర చందనం పట్టుబడినా తెప్పించుకోవచ్చని పవన్ అన్నారు.
Published at : 28 Nov 2024 10:51 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion