Viral News : బ్రేకప్ చెప్పిందని ఆన్‌లైన్‌లో 300 గిఫ్టులు పంపాడు - లవర్‌పై ప్రేమతో కాదు స్వీట్ రివేంజ్!
Bengal: బెంగాల్లో ఓ లవర్ తన మాజీ లవర్ ఇంటికి 300 ఆర్డర్స్ ఆన్ లైన్ లో పంపాడు. కానీ ఏ వస్తువుకూ డబ్బులు కట్టలేదు. అన్నీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు.

Ex lover as revenge: ప్రేమలో ఫెయిలయిన తర్వాత అందరూ ఒకేలా ఆలోచించరు. కొంత మంది దేవదాసులవుతారు . కొంత మంది లవర్ పై కోపంతో రగిలిపోతారు. కానీ ఇలా రగిలిపోయిన అందరూ వైల్డ్ గా ఆలోచించరు. కాస్త వింతగా ఆలోచిస్తారు. అలాంటి ప్రేమికుడు బెంగాల్ లో ఒకరు ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే.. తన మాజీ లవర్ర కు వందల కొద్ది గిఫ్టులు ఆన్ లైన్ లో బుక్ చేసి పంపించాడు. ఇలా పంపితే మంచిదేగా అనుకోవచ్చు..కానీ దేనికీ డబ్బులు కట్టలేదు. అన్నీ క్యాష్ ఆన్ డెలివరీనే. దీంతో ఆ లవర్ బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
వందల సీవోడీ ఆర్డర్స్ రావడంతో అన్నీ రిజెక్ట్ చేసిన యువతి
కోల్‌కతాలోని లేక్ టౌన్ ప్రాంతంలో నివసిస్తున్న 25 ఏళ్ల సుమన్ సిక్దర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తన మాజీ ప్రియురాలు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న యువతిని వేధిస్తున్నారని ఆయనపై బిధాన్ నగర్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో అరెస్టు చేశారు. ఇతను వేధించిన విధానం కూడా పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. తన మాజీ లవర్ ఇంటికి ఖరీదైన వస్తువుల్ని డబ్బులు కట్టకుండా బుక్ చేసేవాడు. నాలుగు నెలల కాలంలో మూడు వందల ఆర్డర్స్ పెట్టాడు. అంటే దాదాపుగా రోజుకు మూడు కంటే ఎక్కువే పెట్టాడు. అన్నీ ఆమె రిజెక్ట్ చేయడంోత అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఆ మహిళ ఖాతాలను బ్లాక్ చేశాయి.
చివరికి భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ లవర్ పనేనని నిర్ధారణ
కావాలనే తనపై ఇలా కుట్ర చేశారని నిర్ణయించుకున్న మహిళ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు FIR నమోదు చేసి విచారణ చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్స్ ఇచ్చింది నాడియా నివాసి సిక్దర్‌కు గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో సిక్దర్ తన మాజీ లవర్ పై ప్రతీకారంగానే COD ఆర్డర్స్ పెట్టినట్లుగా ఒప్పుకున్నారు.
షాపింగ్ పిచ్చి లవర్ - గిఫ్టులు ఆర్డర్ పెట్టలేదనే బ్రేకప్ - అందుకే రివెంజ్ తీర్చుకున్నానని చెప్పిన లవర్
తన మాజీ ప్రియురాలికి ఆన్‌లైన్ షాపింగ్ అంటే పిచ్చి అని. తరచుగా బహుమతులు అడిగేదని సిక్దర్ పోలీసులకు చెప్పా డు. అలా బహుమతులు ఇవ్వలేకపోవడం వల్లనే తాము విడిపోవాల్సి వచ్చిందన్నారు. అందుకే పార్శిల్ డెలివరీల ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నట్లుగా చెప్పాడు. ఈ లవ్ స్టోరీ విని పోలీసులు కూడా అతడిపై జాలిపడాలో.. కోప్పడాలో తేల్చుకోలేకపోయారు.
అయితే ప్రతీకార చర్య అంటే.. కనీసం ఇలా మానసిక వేదన కలిగించే ప్రయత్నం చేశాడు కానీ..ఏదో ఓ అఘాయిత్యం చేయలేదని ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషపడి ఉంటారు.





















