Raju Weds Rambai Director : నెగిటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతా - 'రాజు వెడ్స్ రాంబాయి' డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
Saailu Kampati : లేటెస్ట్ లవ్ ఎంటర్టైనర్ 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Director Saailu Kampati Emotional Speech In Raju Weds Rambai Movie Pre Release Event : అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ లవ్ ఎంటర్టైనర్ 'రాజు వెడ్స్ రాంబాయి' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా... బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన బోల్డ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నెగిటివ్ టాక్ వస్తే...
ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'ఒకవేళ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా ఉరుకుతాను' అంటూ డైరెక్టర్ సాయిలు కంపాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'నేను పల్లెటూరి వాడ్ని. నాకు ఊరి కథలే చాలా ఇష్టం. నేను అలాంటి కథలే రాస్తాను. ఊర్లల్లో పొలం పనులు చేసుకునే రైతులు, అమాయకంగా ఉండే ఆటో డ్రైవర్లు, కాలేజీల్లో అమ్మాయిలు ఇలాంటి వారి మధ్య పుట్టే మొరటు ప్రేమ... నాకు ఇవే తెలుసు.
నేను హెలికాఫ్టర్ నుంచి దిగి వచ్చే హీరోనో, మెట్రో ట్రైన్ దిగి వచ్చే యాక్టర్స్ గురించి రాయలేను. నా ఒరిజినాలిటీ అది కాదు. నేను ఇలాంటి కథలే రాస్తా. ఇదే తీస్తా. ఎందుకంటే నాకు ఇవే వచ్చు. నేను మీ కోసం ఏదో కొత్త సినిమాలు, కొత్త కథలు రాయడానికి రాలేదు. ఓ కొత్త కథ చెప్పేందుకు వచ్చా. నాదేదో చిన్న బతుకు. ఊర్లో నుంచి వచ్చి ఓ కథ రాసుకున్నా. మిమ్మల్ని హర్ట్ చేస్తే క్షమించండి. కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి.' అంటూ రిక్వెస్ట్ చేశారు.
నేను ఊరోడ్ని.. ఊరి కథలే రాస్తాను.
— Rajesh Manne (@rajeshmanne1) November 19, 2025
దయచేసి నా సినిమాను తక్కువగా చూడొద్దు.
సినిమా బాగోక పోతే అమీర్ పేట్ సెంటర్ లో డ్రాయర్ మీద ఉరుకుతా.
- Director #SaailuKampati #RajuWedsRambaiOnNov21st pic.twitter.com/fAK2kW3tX1
నెగిటివ్ ప్రచారం చెయ్యొద్దు
15 ఏళ్లు ఓ జంటకు నరకం చూపించిన ఓ కథను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు డైరెక్టర్ సాయిలు. 'ఈ కథ మీకు నచ్చకుంటే లైట్ తీసుకోండి. కానీ నెగిటివ్ ప్రచారం మాత్రం చెయ్యొద్దు. చిన్న సినిమా ఓ పెద్ద ఎమోషన్ చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని సినిమా హర్ట్ చేస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ నెల 21న సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ రోజున నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతా. మూవీ టీం మొత్తం ఎంతో కష్టపడ్డాం. మా శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రం వెనుక ఎంతో కష్టం ఉంది. ఇది మా ఊరు, వీడు మావోడు అనేలా ఈ ఎమోషన్ మిమ్మల్ని తీసుకెళ్తుంది.' అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
Also Read : ట్రెండింగ్‌లో బాలయ్య, సంయుక్త స్టెప్పులు - మాస్ సాంగ్ 'జాజికాయ జాజికాయ' లిరిక్స్





















