Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Rashmika Marriage : నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పెళ్లి తేదీపై వస్తోన్న రూమర్లపై స్పందించారు. రీసెంట్‌గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కీలక కామెంట్స్ చేశారు.

Rashmika Mandanna Reaction About Her Marriage : గత కొంతకాలంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వార్తలు హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దీనిపై ఇద్దరూ కూడా రియాక్ట్ కాలేదు. అయితే, ఇరువురి చేతికి రింగ్స్ వైరల్ అయ్యాయి. 'దీనిపై రియాక్ట్ కావాల్సిన టైంలో రియాక్ట్ అవుతా' అంటూ రష్మిక రీసెంట్ ప్రెస్ మీట్లలో చెప్పారు. దీంతో ఆమె పరోక్షంగా కన్ఫర్మ్ చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో 'విజయ్‌నే పెళ్లి చేసుకుంటా' అంటూ ఆమె చెప్పడం వీరి ఎంగేజ్మెంట్ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
పెళ్లి డేట్... రష్మిక క్లారిటీ
తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక... విజయ్‌తో పెళ్లి డేట్ అంటూ వస్తోన్న బజ్‌పై రియాక్ట్ అయ్యారు. తాను ఈ రూమర్స్‌ను ఖండించలేనని అన్నారు. 'నేను ఈ వార్తలను ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను. అలాగని ఇప్పుడే ఖండించనూ లేను. పెళ్లి గురించి టైం వచ్చినప్పుడు ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను. కచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతకుమించి వివరాలు ఇప్పుడే ఏమీ చెప్పలేను.' అంటూ చెప్పారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరిలో ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని... మ్యారేజ్ వెన్యూ సెలక్ట్ చేసేందుకు ఆమె రాజస్థాన్ టూర్‌కు వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక క్లారిటీ ఇచ్చారు.
Also Read : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
అది సీరియస్‌గా తీసుకుంటా...
వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడానికి తనకు ఇష్టం ఉండదని రష్మిక అన్నారు. 'నేను పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటా. వ్యక్తిగత జీవితం గురించి బయటకు వెల్లడించడానికి ఇష్టపడను. ప్రతీ పనికి ప్లానింగ్ వేసుకుంటా. సినిమాల విషయానికొస్తే ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. కొన్ని రీజన్స్ వల్ల ఉన్నట్టుండి షూటింగ్ వాయిదా పడుతుంది. మీటింగ్స్, రిహార్సల్స్ కారణంగా ఒక్కోసారి షూట్ లేట్ అవుతుంది.
నేను డబుల్ షిఫ్ట్స్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను డబుల్ షిఫ్స్ట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. యాక్టర్స్ ఎప్పుడూ వర్క్‌లో నిమగ్నమై ఉండాలి. నరుటో కార్టూన్ అంటే నాకు చాలా ఇష్టం. దాని చూస్తూ విశ్రాంతి పొందుతాను.' అని చెప్పారు.
ఈ ఏడాది వెరీ స్పెషల్
ఈ ఏడాది తనకు వెరీ స్పెషల్ అంటూ చెప్పారు రష్మిక. తన కెరీర్, బ్లాక్ బస్టర్ విజయాలు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. 'ఈ ఏడాది 5 సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. విజయం ఒక్కసారిగా రాదు. ఇండస్ట్రీలో ఈ స్థాయి రావాలంటే ఎంతో కష్టపడాలి. నేను ఎలాంటి కథల్లోనైనా యాక్ట్ చేయగలనని ప్రేక్షకులకు తెలియడానికి కొంత సమయం పట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను.
లాంగ్వేజ్, జానర్లకు సంబంధించి ఎలాంటి హద్దులు లేకుండా అన్నిరకాల సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నా. ఈ ఏడాది చేసిన 5 సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాను. అవి చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది.' అని అన్నారు.





















