Telangana Police website hacked : తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్! బరితెగించిన సైబర్ క్రిమినల్స్!
Telangana Police website hacked : బరితెగించిన సైబర్ క్రిమినల్స్ తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు.

Telangana Police website hacked : బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించి చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు సవాల్‌గా మారారు. ఏకంగా పోలీస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి అందులోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. నెటిజన్లు, అవసరమైన వ్యక్తులు పోలీస్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఏదైనా విభాగంపై క్లిక్ చేస్తే వెంటనే అది బెట్టింగ్ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అయ్యింది. వెంటనే సమస్యను గుర్తించిన సైబర్ వింగ్ చర్యలు చేపట్టింది. సమస్యను పరిష్కరించింది.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అందులో ఏ విభాగంపై క్లిక్ చేసినా నేరుగా బెట్టింగ్ సైట్‌లకు రీ డైరెక్ట్ అయ్యేలా చేశారు. మెయిన్ వెబ్‌సైట్ ఆధారంగా మిగతా వెబ్‌సైట్‌లను కూడా నేరగాళ్ల తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనరేట్ల వెబ్‌సైట్‌లు సరిగా పని చేయడం లేదు. టెక్నికల్ టీం దీన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నించింది. ఇంతలో సైబర్ నేరగాళ్లు తమ టాలెంట్ చూపించారు.
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల వెబ్‌సైట్‌లను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే నేరుగా బెట్టింగ్ సైట్‌లు ఓపెన్ అవుతున్నాయి. వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఐటీ విభాగం వెంటనే చర్యలు ప్రారంభించింది. సర్వర్ నుంచి వెబ్‌సైట్ ను హ్యాక్ చేశారని గుర్తించారు. అందుకే మెయిన్ సర్వర్‌ను డౌన్ చేసి సమస్యను పరిష్కరించారు. తర్వాత వెబ్‌సైట్‌లను పునరుద్ధరించారు. అందులో ఉన్న భద్రతా లోపాలను కూడా సవరించారు.
పోలీస్ వెబ్‌సైట్ హ్యాక్, ఇతర వెబ్‌సైట్‌లలో బెట్టింగ్ యాప్స్‌వెబ్‌సైటలకు రీడైరెక్ట్ అవ్వడంపై పోలీసులు ఇంత వరకు స్పందించలేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చాలా కాలంగా బెట్టింగ్ యాప్స్‌పై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారు. యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిని పిలిచి విచారిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడిన అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్నారని గ్రహించి పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు వారి వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సైబర్ నేరగాళ్లు వారికి సవాల్ చేశారు. దీనిపై పోలీస్ శాఖ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.





















