IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
IndiGo Flights canceled: ఇండిగో సంస్థకు చెందిన వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కేంద్రంగా 30వరకు సర్వీస్‌లను క్యాన్సిల్ చేశారు.

IndiGo Flights canceled: భారతీయ విమానయాన రవాణాలో కలకలం రేగింది. బుధవారం ఇండిగో సంస్థ 100కి పైగా విమాన సర్వీస్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరు, ముంబై , హైదరాబాద్ విమానాశ్రయాల్లో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
టెక్నికల్‌సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఇండిగో ప్రకటించింది. ఇలా ఒకేసారి విమానాలు రద్దు కావడం, అనేక ఇతర విమానాలను ఆలస్యం కావడంపై భారత విమానయాన నియంత్రణ సంస్థ DGCA దర్యాప్తు ప్రారంభించింది. PTI నివేదికల ప్రకారం, ఈ సంక్షోభానికి గల కారణాలను వివరించాలని, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలను , ప్రణాళికలను చెప్పాలని ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది.
“సిబ్బంది / FDTL అనుమతి, విమానాశ్రయం / ఎయిర్‌స్పేస్ / ATC-సంబంధిత వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదు వచ్చాయి. వీటిలో చాలా వరకు ఆపరేటర్ ప్రత్యక్ష నియంత్రణకు సంబంధించినవే” అని DGCA తెలిపింది.
VIDEO | IndiGo is facing nationwide flight delays and cancellations. Visuals from Delhi’s Indira Gandhi International Airport (IGI) show the flight-information display boards amid the disruptions.#DelhiFlights #IndiGo #IGIAirport
— Press Trust of India (@PTI_News) December 4, 2025
(Full video available on PTI Videos –… pic.twitter.com/V49Jb87SUh
ఇండిగో ఏం చెబుతోంది
గత రెండు రోజులుగా ఇండిగో నెట్‌వర్క్ పరిధిలో అంతాయుల ఏర్పాడుతున్నాయి. దీనిపై ఇండిగో కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. “అంతరాయాన్ని అరికట్టడానికి, పరిస్థితిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రకటించిన సర్వీస్‌లను రీ షెడ్యూల్ చేస్తున్నాం. సర్వీస్‌లను సర్దుబాటు చేస్తున్నాం. ఈ చర్యలు రాబోయే 48 గంటలపాటు అమలులో ఉంటాయి. కార్యకలాపాలను సాధారణీకరించడానికి, నెట్‌వర్క్ అంతటా పరిస్థితి చక్కదిద్దేందుకు సమయం పడుతుంది” అని ఎయిర్‌లైన్ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి గందరగోళంలో ఉన్నందున ప్రయాణికుల సౌకర్యం కోసం తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు వాళ్లు సమాచారం అందిస్తామని పేర్కొంది.





















