అన్వేషించండి

IndiGo Flight Emergency Landing: టేకాఫ్ అయిన కాసేపటికే ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి, పట్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

విమానం IGO5009 అత్యవసర పరిస్థితి ప్రకటించి సురక్షితంగా జయప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో దిగింది. 175 మంది ప్రయాణికులు ఉన్నారు.

పాట్నా: ఓ ఇండిగో విమానం బుధవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పక్షిని ఢీకొట్టింది.  దాంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండిగో విమానం పాట్నాకు తిరిగి వచ్చింది. IGO5009 విమానం దాదాపు 175 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ఇండిగో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బుధవారం ఉదయం 8:42 గంటలకు విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. "పాట్నా నుండి ఢిల్లీకి వెళ్తున్న IGO5009 విమానం 0842 సమయానికి టేకాఫ్ అయిన ఇండిగో కొంత సమయానికే పక్షిని ఢీకొట్టింది. చెక్ చేయగా రన్‌వేపై ఒక చనిపోయిన పక్షి భాగాలు కనిపించాయి. అదే విషయాన్ని అప్రోచ్ కంట్రోల్ యూనిట్ ద్వారా విమానానికి తెలియజేశారు. ఒక ఇంజిన్‌లో వైబ్రేషన్ కారణంగా విమానం పాట్నాకు తిరిగి రావాలని అప్రోచ్ కంట్రోల్ యూనిట్ నుండి మెస్సేజ్ చేశారు.  లోకల్ స్టాండ్-బై ప్రకటించారు. విమానం రన్‌వే 7లో 0903 ISTకి సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు" అని విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఆ ఇండిగో విమానాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. 

ఇటీవల వరుస ఘటనలు

పక్షి ఢీకొట్టడంతో విమానాలు ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట పాట్నా ఎయిర్ పోర్ట్ నుండి రాంచీకి వెళ్తున్న మరో ఇండిగో విమానం గాలిలో ఉండగా ఒక డేగను ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం 3,000 నుంచి 4,000 అడుగుల ఎత్తులో ఉండగా 10 నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో పక్షి ఢీకొట్టింది. ఆ విమానం రాంచీకి చేరుకున్నాక అటు నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది.

“రాంచీ సమీపంలో ఇండిగో విమానం ఓ పక్షిని ఢీకొట్టింది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వెళ్తుండగా ఇది జరిగింది. అయితే పైలట్ సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది” అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య అన్నారు.

ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి

జూన్ 23న ఢిల్లీ నుండి వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో పక్షిని ఢీకొట్టింది. దాంతో తిరువనంతపురం-ఢిల్లీ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ నుండి తిరువనంతపురానికి వెళ్తున్న AI2454 విమానం ల్యాండింగ్ సమయంలో పక్షిని ఢీకొట్టిందని అధికారులు భావించారు. ఆ కారణంతో విమానం AI2455ని ముందు జాగ్రత్త చర్యగా తర్వాత సర్వీసును ఎయిర్ లైన్స్ రద్దు చేసింది. భారత్ లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. టెక్నికల్ కారణాలతో ప్రమాదాలు జరిగాయి. కానీ పక్షులు ఢీకొనడంతో ప్రమాదాలు జరగిన ఘటన చాలా అరుదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget