Donald Trump Tarrifs: బ్రిక్స్ కూటమిపై విషం చిమ్మిన అమెరికా, భారత్ 10 శాతం సుంకం చెల్లించాలన్న డొనాల్ట్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ BRICS కూటమిపై విమర్శలు గుప్పించారు. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తే భారత్ పై 10% సుంకం విధిస్తామని ఆయన హెచ్చరించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ కొనసాగిస్తున్నారు. ఆయన విధించే సుంకాలతో పలు దేశాలు సతమతం అవుతున్నాయి. నిన్న కొన్ని దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన ట్రంప్ అనంతరం బ్రిక్స్ దేశాలపై పడ్డారు. భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన BRICS కూటమి, US డాలర్ ఆధిపత్యాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు.
వాషింగ్టన్లో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, " భారతదేశం BRICSలో కొనసాగితే 10 శాతం టారిఫ్ చెల్లించాలి, ఎందుకంటే BRICS కూటమి అమెరికాను దెబ్బతీయాలని చూస్తోంది. BRICS దేశాలు అమెరికా డాలర్ అధిపత్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు అయింది" అన్నారు. డాలర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హోదాను బలహీనపరిచేందుకు BRICS ప్రయత్నించిందని US అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ పునరుద్ఘాటించారు. డాలర్ బలహీనపడితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
వీడియో | వాషింగ్టన్: "BRICS మనల్ని దెబ్బతీసేందుకు ఏర్పాటు చేయబడింది కాబట్టి, వారు (భారతదేశం) BRICSలో ఉంటే 10 శాతం చెల్లించాలి; BRICS మన డాలర్‌ను దిగజార్చడానికి ఏర్పాటు చేయబడింది" అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (@POTUS) అన్నారు.
— ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (@PTI_News) జులై 8, 2025
(మూలం: మూడవ పక్షం)
(పూర్తి వీడియో PTI వీడియోలలో లభిస్తుంది -… pic.twitter.com/zRFQtWGVDk
బ్రిక్స్ పై ట్రంప్ వార్ మొదలైందా..
"BRICS చాలా వరకు విడిపోయిందని అనుకున్నాను. BRICS కూటమి మనకు తీవ్రమైన ముప్పు కాదు, కానీ వారు అమెరికా డాలర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఎప్పటికీ ప్రమాణాన్ని కోల్పోకూడదు. తెలివైన అధ్యక్షుడు ఉంటే, మీరు ఎప్పటికీ అమెరికా డాలర్ విలువను తగ్గించలేరు. గతంలో ఉన్నట్లు అధ్యక్షుడు ఉంటే, అమెరికా డాలర్ పతనమయ్యేది. మనం ప్రపంచ ప్రమాణంగా డాలర్‌ను కోల్పోతే, అది యుద్ధం కోల్పోయినట్లుగా మారుతుంది. ప్రపంచంలో డాలర్ ను కింగ్ లాగ ఉంచుతాం" అని ఆయన వ్యాఖ్యానించారు. BRICSలో పాల్గొనే లేదా మద్దతు ఇచ్చే దేశాలకు స్పష్టమైన సందేశం పంపారు. డాలర్‌ను సవాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఆగస్టు 1 సుంకాల గడువుపై ట్రంప్
ఆగస్టు 1, 2025న పరస్పర సుంకాలు అమలులోకి వస్తాయని, ఆలస్యం ఉండదని ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘ఇతర దేశాలు US ఆర్థిక వ్యవస్థను దోచుకోవడానికి అనుమతించాయని.. ఇతర దేశాలు విధించే సుంకాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.. పలు దేశాలకు ఫోన్ చేశాను, వారు మాకు ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇలాంటి పరిపాలన అమెరికాలో జరగలేదు. సుంకాలు రికార్డు స్థాయిలో వస్తున్నాయి... మేము నిబంధనలకు మాత్రమే కట్టుబడి ఉంటాము. ఆగస్టు 1న అమెరికాలో మంచి రోజులు ప్రారంభమవుతాయని" ట్రంప్ పేర్కొన్నారు.
#WATCH | US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "...సుంకాలు రికార్డు స్థాయిలో వస్తున్నాయి... మేము భారీ సుంకాలు విధించే ఇతర దేశాల నిబంధనలకు మాత్రమే కట్టుబడి ఉంటాము. మేము глупы లేదా వ్యాపార భావం లేని వ్యక్తులచే నడిపించబడ్డాము... పెద్ద డబ్బు ప్రారంభమవుతుంది... pic.twitter.com/cl2JewDliS
— ANI (@ANI) జులై 8, 2025
సుంకాల రూపంలో అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఆగస్టులో ప్రారంభమయ్యే కొత్త సుంకాలకి సంబంధించి 14 దేశాలకు లేఖలు పంపించామని నిర్ధారించారు.






















