Trump Signs One Big Beautiful Bill: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం-ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కామెంట్
One Big Beautiful Bill: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడు ఇది చట్టంగా మారింది.

Donald Trump Signed A Big Beautiful Bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం (జులై 04, 2025) నాడు వైట్ హౌస్లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేశారు. ప్రజల పన్నులను తగ్గించడం, ఖర్చులను తగ్గించడం వంటి వాటికి సంబంధించినది ఈ బిల్లు. రిపబ్లికన్ పార్టీ సహాయంతో పార్లమెంటులో ఆమోదం పొందిన ఒక్కరోజు తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడు అధ్యక్షుడి సంతకం చేయడంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. ఇది ట్రంప్ విజయాలలో ఒకటిగా పరిగణిస్తారు.
సంతకం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "ఈ బిల్లు సైన్యం, సాధారణ పౌరులు, అన్ని రకాల ఉద్యోగాల బాగోగులు చూసుకుంటుంది, దేశంలోని ప్రజలు ఇంత సంతోషంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు." ఈ సందర్భంగా ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి సహాయం చేసిన స్పీకర్ మైక్ జాన్సన్ సెనేట్ నాయకుడు జాన్ థున్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
SIGNED. SEALED. DELIVERED. 🧾🇺🇸
— The White House (@WhiteHouse) July 4, 2025
President Trump’s One Big Beautiful Bill is now LAW — and the Golden Age has never felt better. pic.twitter.com/t0q2DbZLz5
ట్రంప్ మాట్లాడుతూ, "ఇందులో అమెరికా చరిత్రలో అతిపెద్ద పన్ను కోత, అతిపెద్ద ఖర్చుల తగ్గింపు, అతిపెద్ద సరిహద్దు భద్రతా పెంచే అంశాలు ఉన్నాయి. " జులై 4న వైట్ హౌస్ సౌత్ లాన్లో ఒక ప్రత్యేక వేడుకలో ఈ సంతకం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడుల్లో పాల్గొన్న ఫైటర్ జెట్లు, స్టీల్త్ బాంబర్లు విన్యాసాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ట్రంప్ మద్దతుదారులు, ఇతర నాయకులు, సైనిక కుటుంబాలు, వైట్ హౌస్ సిబ్బందితో సహా వందలాది మంది పాల్గొన్నారు.
POTUS. FLOTUS. B-2 BOMBER. 🇺🇸🦅
— The White House (@WhiteHouse) July 4, 2025
MAKE AMERICA GREAT AGAIN! pic.twitter.com/9HAFMdZrhe
ఏంటీ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు?
ఈ బిల్లు ట్రంప్ రెండో పదవీకాలంలో అత్యంత ముఖ్యమైన పథకంగా చెబుతున్నారు. ఇందులో 2017 పన్ను కోతను శాశ్వతంగా అమలు చేయడం, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, కఠినమైన వలస చట్టాలు తీసుకురావడం వంటివి ఉన్నాయి. ఈ చట్టంలో అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ ఎత్తు పెంచడానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల కోసం 1 లక్షల,10,000 కొత్త ఇమ్మిగ్రేషన్ అధికారుల నియామకం వంటి చాలా సంచలన నిర్ణయాలు ఉన్నాయి. ప్రతి అధికారికి 10,000 డాలర్ల బోనస్ కూడా ఇవ్వనున్నారు.
ఈ బిల్లుపై వివాదాలు అన్నే ఉన్నాయి. దీనివల్ల లక్షల మంది అమెరికన్ల ఆరోగ్య బీమా కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ బిల్లు అమెరికాలో ఇప్పుడు ఉన్న అప్పులకు మరో 3 ట్రిలియన్ డాలర్లు జోడిస్తుంది. ప్రస్తుతం అమెరికాపై 36.2 ట్రిలియన్ డాలర్ల రుణం ఉంది.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అనుకూలంగా 218 ఓట్లు
హౌస్లో బిల్లుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు, అయితే 212 మంది డెమోక్రటిక్ సభ్యులందరూ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమోక్రటిక్ నాయకుడు హకీమ్ జెఫ్రీస్ బిల్లును వ్యతిరేకిస్తూ 8 గంటల 46 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ చట్టం ధనికులకు ప్రయోజనం చేకూరుస్తుందని, సాధారణ ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు.





















