Naga chaitanya Sobhita Marriage : నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
Naga Chaitanya Sobhita : నాగచైతన్య శోభితల వివాహం జరిగి నేటికి సరిగ్గా ఏడాది. ఈ జంట తమ మొదటి పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభిత స్పెషల్ వీడియో షేర్ చేశారు.

Naga Chaitanya Sobhita Dhulipala First Wedding Anniversary : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, శోభిత దూళిపాల వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా మొదటి పెళ్లిరోజును ఈ కపుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. శోభిత తన పెళ్లి నాటి వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు.
'శ్రీమతిగా ఏడాది'
తాను ఎంతగానో ప్రేమించిన చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని... చై తన లైఫ్‌లోకి వచ్చాకే జీవితం పరిపూర్ణమైందని 'అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్లుగా శ్రీమతిగా ఏడాది' అంటూ పెళ్లి నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ జంటకు విషెష్ చెబుతున్నారు.
View this post on Instagram
Also Read : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
గతేడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో నాగచైతన్య, శోభిత వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తన భర్త నాగచైతన్య గురించి పలు విషయాలు షేర్ చేసుకునేవారు. కార్ రేసింగ్ వంటి సందర్భాల్లో బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసేవారు. ఇప్పుడు శ్రీమతిగా ఏడాది పూర్తైందంటూ బెస్ట్ మూమెంట్ విత్ స్పెషల్ వీడియోను షేర్ చేసుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే... నాగచైతన్య లాస్ట్‌గా 'తండేల్' మూవీతో బిగ్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. చై సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక శోభిత స్టార్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వేట్టువం' మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు.





















