కిరణ్ అబ్బవరం జర్నీకి తాను నంబర్ వన్ ఫ్యాన్ అని యువ సామ్రాట్ నాగ చైతన్య చెప్పారు. అసలు, ఇండస్ట్రీలో కిరణ్ ఎలా వచ్చారు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏమిటి? అనేది చూడండి.
కిరణ్ అబ్బవరం రాయచోటి కుర్రాడు. ఆయన వయసు 32 ఏళ్లు. కూలి పని చేసి, విదేశాలు వెళ్లి ఆయన తల్లి కష్టపడి చదివించారు. బీటెక్ చేశాక రెండేళ్లు చెన్నై, బెంగళూరులో 'నెట్‌వర్క్ కన్సల్టెంట్'గా ఉద్యోగం చేశారు కిరణ్.
నటన మీద ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ నుంచి నటుడిగా కిరణ్ అబ్బవరం కెరీర్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ 'శ్రీకారం'ను ముందు షార్ట్ ఫిలింగా తీశారు. అందులో హీరో కిరణ్ అబ్బవరం. దాంతో పాటు ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు.
షార్ట్ ఫిలిమ్స్ లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం... 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.
హీరోగా తన తొలి సినిమా 'రాజావారు రాణిగారు'లో కథానాయికగా నటించిన రహస్యతో కిరణ్ అబ్బవరం ప్రేమలో పడ్డారు. ఆగస్టు 22, 2024లో కూర్గ్ లో ఆమెను పెళ్లి చేసుకున్నారు.
హీరోగా కిరణ్ అబ్బవరం రెండో సినిమా 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'. కరోనా తర్వాత విడుదలైన ఆ సినిమా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించింది. మంచి వసూళ్లు సాధించింది.
మొదటి రెండు విజయాల తర్వాత కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. మధ్యలో కొన్ని పోయినా 'సమ్మతమే', 'వినరో భాగ్యము విష్ణుకథ' విజయాలు సాధించాయి.
వరుస వైఫల్యాలు ఎదురు కావడంతో ఆత్మ విమర్శ చేసుకున్న కిరణ్ అబ్బవరం ఏడాది విరామం తీసుకున్నారు. కథలపై వర్క్ చేసి, 'క' సినిమా చేశారు. ఇది తనకు గేమ్ చేంజర్ అని ఆయన చెబుతున్నారు.
'క' సినిమాకి కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్థాయికి వెళుతున్నారు. తెలుగులో అక్టోబర్ 31న... తర్వాత ఇతర భాషల్లో (నవంబర్ 8న) విడుదల చేయనున్నారు.