దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'లక్కీ భాస్కర్' అక్టోబర్ 31న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఒక్క రోజు ముందు ప్రీమియర్ షోలు వేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'క'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న తెలుగులో విడుదల చేస్తున్నారు. వారం తర్వాత... నవంబర్ 8న తమిళ, మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడు ముకుంద్ కథతో రూపొందిన తమిళ సినిమా 'అమరన్'. తెలుగులోనూ అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో బజ్ నెలకొంది.
'కెజిఎఫ్', 'సలార్' సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ సినిమా 'బఘీర'. అక్టోబర్ 31న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ' భూల్ బులయ్యా 3'. విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ఆత్మలుగా కనిపించనున్న ఈ సినిమాలో తృప్తి దిమ్రి హీరోయిన్.
అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి మరోసారి 'సింగం' ఫ్రాంచైజీలో సినిమా చేశారు. 'సింగం ఎగైన్' అంటూ నవంబర్ 1న థియేటర్లలోకి వస్తున్నారు. రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకోన్, టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో నటించారు. అజయ్ భార్య పాత్రలో కరీనా కనిపించనున్నారు.
దీపావళికి మీ ఛాయస్ ఏది? మీరు ఏ సినిమా చూడాలని అనుకుంటున్నారు? మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదో చెప్పండి.