విజయ్ దేవరకొండని యూత్ ఐకాన్‌గా మార్చిన సినిమాలివే
ఈ రౌడీ బాయ్ సినిమాలు.. అతని యాటీట్యూడ్.. ఫ్యాన్స్‌తో ఉండే విధానం అన్ని కలిసి అతనిని యూత్ ఐకాన్‌గా మార్చాయి.
విజయ్ దేవరకొండ కెరీర్‌ని మలుపు తిప్పి.. యువతలో క్రేజ్ పెంచిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఫుల్ కాంట్రవర్సీలతో ట్రైలర్, పోస్టర్లతో సెన్సేషన్ సృష్టించాడు విజయ్ దేవర కొండ. ఇంక సినిమా విడుదలైన తర్వాత యూత్ విజయ దేవరకొండ జపం చేశారనే చెప్పాలి. సినిమాలో అతని యాటీట్యూడ్, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ.. అర్జున్ రెడ్డికి పూర్తి విరుద్ధంగా.. పెళ్లి చేసుకోబోయేవాడు ఇలా ఉండాలనిపించేలా అమ్మాయిలకు దగ్గరయ్యాడు విజయ్. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు.
సంతోషంగా ఉండడానికి డబ్బు వెనుక పరుగెత్తాల్సిన అవసరం లేదంటూ రిషి పాత్రలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు విజయ్. సినిమాలో మెయిన్ హీరో నాని అయినా.. సినిమా అంతా విజయ్ చుట్టూనే తిరుగుతుంది.
అమ్మాయికి కష్టమొస్తే.. తనకి ఓ క్రామేడ్గా అండగా నిలవాలి.. ఆమె పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేలా చేయాలి అనే సెన్సిటివ్ కథను తెరపైకి తెచ్చాడు విజయ్. ఈ సినిమా ఫ్లాప్ అయినా యూత్‌కి బాగా కనెక్ట్ అయింది.
అల్లరిచిల్లరిగా.. ఎలాంటి బాధ్యతలేని యువకుడిగా.. డెస్క్ జాబ్‌లు కంటే ప్యాషన్‌ని ఫాలో అయితే సంతోషంగా ఉంటూనే సక్సెస్ అందుకోవచ్చని పెళ్లి చూపులు సినిమాతో చెప్పాడు విజయ్. హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్నాడు. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇటు యూత్‌ని ఆకట్టుకున్న సినిమా ఇది.
మహానటి సినిమాలో కూడా చేసింది చిన్న పాత్ర అయినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు విజయ్. ప్రేమించిన అమ్మాయిని కెరీర్లో ముందుకు వెళ్లేలా ప్రోత్సాహిస్తూ.. ఆమెకు రియల్ బ్యూటీ ఇదేనంటూ చూపించి గ్రీన్ ఫ్లాగ్గా నిలిచాడు విజయ్.
లైగర్ సినిమా ఫ్లాప్ కావొచ్చు. ఆ సినిమా కోసం విజయ్ తన బాడీని మార్చిన తీరు చాలామందిని ఇన్స్పైర్ చేసింది.