నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'కంగువ'లో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. మోడ్రన్ యువకుడిగా, అడవుల్లో పెరిగి పూర్వీకుడిగా ఆయన కనిపించనున్నారు.
సూర్య ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా 'సుందరాంగుడు'. అందులో లుక్ పరంగా ఆయన ప్రయోగాలు చేశారు. టైటిల్‌కు తగ్గట్టు సుందరాంగుడిగా... మరొక పాత్రలో గూని మెడతో కనిపించారు.
'సుందరాంగుడు' తర్వాత సూర్య డ్యూయల్ రోల్ చేసిన సినిమా 'సెవెంత్ సెన్స్'. నటుడిగా ఆయనకి పేరు తెచ్చిన సినిమా. 'గజినీ' తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రమిది.
తెలుగులో 'బ్రదర్స్'గా విడుదలైన తమిళ సినిమా 'మాట్రన్'. అందులో సపరేట్ చేయాలని, ఒకే గుండెతో బ్రతికే ట్విన్స్ రోల్స్ చేశారు. చివరకు, ఓ ట్విన్ చనిపోతారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా 'రాక్షసుడు'. ఆయన చేసిన హారర్ సినిమా అది. ఆత్మగా కనిపించే లుక్, ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చాయి.
డ్యూయల్ కాదు... సూర్య ట్రిపుల్ ధమాకా ఇచ్చిన సినిమా '24'. విక్రమ్ కె కుమార్ ఆ మూడు లుక్స్ చూపించిన తీరు... ముఖ్యంగా సూర్య విలనిజం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది.
'వీడోక్కడే', 'ఘటికుడు' సినిమాల్లో సూర్య డ్యూయల్ రోల్స్ చేయలేదు. కానీ, ఆయా సినిమాల్లో ఆయన డిఫరెంట్ లుక్స్‌లో కనిపించి నటుడిగా తన వెర్సటాలిటీ చాటుకున్నారు.
'కంగువ' టీజర్, సాంగ్స్ ఆల్రెడీ విడుదల అయ్యాయి. అందులో సూర్య లుక్స్ చాలా బావున్నాయి. మరి, సినిమాలో ఎలా ఉంటాయో చూడాలి.