కేరళ కంటే తెలుగులో ఎక్కువ... 'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో 'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 15 కోట్లు అని టాక్. నైజాంలో 'లక్కీ భాస్కర్' థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్లు అని తెలిసింది. రాయలసీమ (సీడెడ్) రైట్స్ రూ. 2.2 కోట్లు కాగా... ఆంధ్రాలో అన్ని ఏరియాలు కలిపి రూ. 6.8 కోట్లు. తమిళనాడు, కర్ణాటకలో 'లక్కీ భాస్కర్' థియేట్రికల్ రైట్స్ కొట్టిన్నర, కోటిన్నర మాత్రమే. 'లక్కీ భాస్కర్' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయి. కేరళలో 'లక్కీ భాస్కర్' రైట్స్ రూ. 3 కోట్లు కాగా... ఓవర్సీస్ రైట్స్ మరొక రూ. 4 కోట్లు వచ్చాయి. టోటల్ 'లక్కీ భాస్కర్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 30 కోట్లు అని టాక్. దుల్కర్ సల్మాన్ ముందు ఉన్న టార్గెట్ రూ. 33 కోట్ల షేర్. అంత వస్తే... డిస్ట్రిబ్యూటర్లు సేఫ్.