ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్ టీమ్ నుంచి విడుదలైన పోస్టర్ అభిమానులను కన్ఫ్యూజ్ చేసేసింది. ఇప్పటివరకు ప్రభాస్ స్టైలిష్ లుక్స్‌నే విడుదల చేసిన చిత్ర బృందం.. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా సర్ప్రైజ్ ఇచ్చింది. గతంలో ప్రభాస్‌ని లుంగీ కట్టుకుని ఒక ఫోటో, చేతిలో బొకే పెట్టుకున్న ఫోటోలు షేర్ చేశారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా స్టైలిష్ లుక్స్‌లో గాగ్స్ పెట్టుకున్న ఫోటోను ముందురోజు విడుదల చేశారు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్‌డే రోజు మాత్రం.. ఓల్డ్ లుక్‌లో ఉన్న స్టైలిష్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేసి డ్యూయల్ రోల్ డౌట్ పెంచారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా. దట నిధి అగర్వాల్ మరో హీరోయిన్గా చేస్తుంది. ప్రభాస్‌కి మొదటిసారి జోడి కడుతుంది. డైరక్టర్ మారుతీ.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్ట్‌గా తమన్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ దీనికంటే ముందు బిల్లాలో కూడా డ్యూయల్ రోల్ చేశారు. బాహుబలి సిరీస్‌లో కూడా ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించి మెప్పించారు.