TamilNadu Minister: హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
Ponmudy: తమిళనాడు డీఎంకే మంత్రి పొన్ముడి హిందూ దేవతల్ని ఉద్దేశించిచేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది హిందూత్వంపై దాడిగా విమర్శలు వస్తున్నాయి.

TamilNadu Minister Ponmudy: తమిళనాడు అటవీ శాఖ మంత్రి, డీఎంకే సీనియర్ నేత కె. పొన్ముడి హిందూ దేవుళ్ల గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక బహిరంగ సభలో హిందూ మతంలోని తిలకం ఆచారంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన తిలకాలను లైంగిక స్థానాలతో పోల్చి, సెక్స్ వర్కర్లతో ముడిపెడుతూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
இதுபோன்ற கேடுகெட்ட பேச்சு கேடுகெட்ட செயல்கள் எல்லாம் திமுகவினரால் தான் பேசமுடியும் செய்யமுடியும் #Ponmudy pic.twitter.com/ZHDygE272i
— Chennai MP Johnson (@mpjohnson_ch) April 11, 2025
మంత్రి చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ గా మారాయి.
ஒரு மாண்புமிகு அமைச்சர் பேசக்கூடிய பேச்சா இது 🤮 ச்சை
— DS Pradeep (@DSPradeep_) April 11, 2025
படுத்துகிட்டு... நின்னுகிட்டு...
இந்தக் கேவலமான பேச்சுக்கு வெறும் கட்சி பொறுப்புகளில் இருந்து மட்டும் நீக்கினால் போதுமா ?
திமுகவில் உள்ள பெண்களும், மகளிர் சங்கங்களும் இதை எப்படி பொறுத்துக் கொள்கிறார்கள்??#Ponmudy… pic.twitter.com/w9Ngxv3UOJ
పొన్ముడి వ్యాఖ్యలను డీఎంకే నేతులకూడా ఖండించారు. ఎంపీ కనిమొళి కూడా సొంత పార్టీ మంత్రిపై మండిపడ్డారు.
அமைச்சர் பொன்முடி அவர்களின் சமீபத்திய பேச்சு ஏற்றுக்கொள்ள முடியாதது. எந்த காரணத்திற்காகப் பேசப் பட்டிருந்தாலும் இப்படிப்பட்ட கொச்சையான பேச்சுகள் கண்டிக்கத்தக்கது.
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) April 11, 2025
నటి ఖుష్బు, గాయని చిన్మయి శ్రీపాదతో పాటు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా దీనిని హిందూ విశ్వాసాలపై దాడిగా అభివర్ణించారు.
அமைச்சர் பொன்முடி அவர்கள் பெண்களை இழிவுப்படுத்தி பேசியதாக எல்லாரும் கண்டிக்கிறார்கள் !
— Duraimurugan (@Saattaidurai) April 11, 2025
திராவிட இயக்கத்தை இப்படித்தான் ஆபாசமாக ,வக்கிரமாக ,பாலியல் கதைகளை பேசி வளர்த்தோம் என்ற உண்மையைச் சொல்லியுள்ளார் பொன்முடி !
திராவிடம் என்றாலே ஆபாசம்தானே ! ஈவெரா என்பவரே அந்த காலத்து சிவாஜி… pic.twitter.com/G2anLV1nM0
ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో డీఎంకే స్పందించింది. పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది. పొన్ముడి స్థానంలో ఎన్. శివను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. అయితే, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించలేదు.
కె. పొన్ముడి పూర్తి పేరు దేవసిగమణి కె. పొన్ముడిగా ప్రసిద్ధి చెందిన ఆయన ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989 నుంచి ఐదో సారి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 2023లో మద్రాస్ హైకోర్టు పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షిపై అక్రమాస్తుల ఆస్తుల కేసులో దోషులుగా తీర్పు చెప్పింది. దీంతో ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవులపై అనర్హతా వేటు పడింది. కానీ సుప్రీంకోర్టు 2024లో తీర్పుపై స్టే ఇవ్వడంతో పదవిలో మళఅలీ నియమించారు. పొన్ముడి విల్లుపురం-కల్లకురిచ్చి బెల్ట్‌లో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు, డీఎంకేలో మైనారిటీ ఓట్లను సమీకరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఆయనపై అనర్హతా వేటు పడినా మళ్లీ మంత్రిగా చాన్సిచ్చారు. ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయనను పార్టీ పదవి నుంచి తప్పించారు కానీ.. మంత్రి పదవి నుంచి తప్పించలేకపోయారు.





















