AI Baby: ఇది కూడా అయిపోయింది - ఫస్ట్ AI బేబీ పుట్టేశాడు - ప్రపంచ జనాభా సమస్య తీరుతుందా ?
AI Baby: IVF టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు వీధివీధినా ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీతో బిడ్డల్ని పుట్టించడం ప్రారంభిస్తున్నారు.

World First Baby Born Using AI : ప్రపంచ గమనాన్ని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మార్చేస్తోంది. చదువు, ఉద్యోగం, వ్యవసాయం, ఇంట్ోల పనులు సహా ప్రతి చోటా వినియోగంలోకి వస్తోంది. కానీ ఇప్పుడు AI ను పిల్లలను కనడానికి కూడా ఉపయోగించడం ప్రారంభించారు. విచిత్రంగా ఉన్నా కానీ ఇది నిజం. AI సహాయంతో ప్రపంచంలోని మొదటి బిడ్డ జన్మించింది.
AI సహాయంతో ఫలదీకరణం
AI సహాయంతో IVF సిస్టమ్‌ను ఉపయోగించి ప్రపంచంలోని మొదటి బిడ్డను పుట్టించారు. ఈ సిస్టమ్ IVF లో ఉపయోగించే సాధారణ పద్ధతి అయిన ఇంట్రాసైటోప్లాజమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) సాంప్రదాయ మాన్యువల్ ప్రక్రియకు ప్రత్యామ్నాయం లాంటింది. దులో ఒక స్పెర్మ్‌ను నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ కొత్త ప్రక్రియ ఇప్పుడు AI లేదా రిమోట్ డిజిటల్ నియంత్రణ ద్వారా మనుషుల ప్రమేయం లేకుండానే ICSI ప్రక్రియలోని 23 దశలను పూర్తి చేస్తుది.
AI ఎలా సహాయపడింది?
అమెరికాలోని ఒక ఫెర్టిలిటీ క్లినిక్‌లో AI ఫలదీకరణం టెస్టు చేశారు. AI ఎంచుకున్న అండాన్ని స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఈ గర్భదారణ విజయవంతమైంది. ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించింది.
A 40-year-old woman in Mexico has given birth to the world’s first baby conceived through an AI-powered IVF procedure.
— Pop Base (@PopBase) April 10, 2025
This is the first time an AI system has performed all 23 steps of the ICSI procedure — including sperm selection and injection — without human hands. pic.twitter.com/nwJ4gZPnab
AI ఎలా అండాన్ని ఎంచుకుంది?
IVF లో అనేక అండాలను రెడీ చేస్తారు. కానీ ఏ అండం అత్యంత ఆరోగ్యకరమైనది , విజయవంతమైన గర్భధారణకు దారితీస్తుందో ఎంచుకోవడం చాలా కష్టం. AI అల్గోరిథం మైక్రోస్కోపిక్ ఇమేజెస్‌ను విశ్లేషించి, వైద్యుని కంటికి కనిపించని అత్యంత సరైన అండాన్ని ఎంచుకుంది.
So allot of coins ran and thank god someone DMd me to proof check me but this is the coin that’s linked to the ai baby. Either way 10k mc or 76k mc this is extremely under valued this is gonna run
— MERC (@profitablejey) April 11, 2025
GgXZUpLM9BCRHaUz4S2Tz9NYWo8hbPHDUmz6GvQnpump pic.twitter.com/TT7HJ7tqQf
IVF లో AI ను చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు
AI సాంకేతికతలో అండం పెరుగుదల, కణాల విభజన వేగం , ఇతర జీవసంబంధ సంకేతాలను ఎప్పటికప్పుడు పరిశీలించింది. దీని వల్ల IVF సక్సెస్ రేటు గతంలో కంటే చాలా మెరుగైంది. IVF ఖరీదైన, అలసట కలిగించే ప్రక్రియ. AI ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఖచ్చితంగా చేయడం ద్వారా సమయం , డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది.





















