ChatGPT: దెయ్యాలను కనిపెడుతున్న ఛాట్‌జీపీటీ - వణికిపోతున్న నెటిజన్లు, 'ఒకటి' పడుతోంది
ChatGPT's Newest Trend: ఛాట్‌జీపీటీ ఫొటోల్లో దెయ్యాల నుంచి పుట్టబోయే శిశువుల వరకు కనిపిస్తున్నాయి. ఆ మేకోవర్ చూసిన జనం హడలిచస్తున్నారు.

Ghosts Aad Babies In ChatGPT Ghibli Style Images: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఛాట్‌జీపీజీ జీబ్లీ స్టైల్‌లో రూపొందించిన చిత్రాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చాలామంది, ఈ ఇమేజ్‌లను తమ ప్రొఫైల్ పిక్చర్స్‌లా పెట్టుకున్నారు. అయితే, కొంతమందికి ఈ AI శైలి భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. కొన్ని చిత్రాలలో, ఊహించని వ్యక్తులు కనిపించారు. దీంతో, ఈ AI ఫ్లాట్‌ఫామ్‌ను ఒక ఘోస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలుస్తున్నారు నెటిజన్లు.
ఇమేజ్ - 1
ఒక జంట, తమ ఫొటోను ఛాట్‌జీపీటీలోకి అప్‌లోడ్ చేసి, దానిని స్టుడియో జీబ్లీ స్టైల్‌లోకి మార్చమని కోరింది. అంతేకాదు, ఆ ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌ను మంచి ఉద్యానవనంలా క్రియేట్ చేయమని సూచించింది. ఛాట్‌జీపీటీ వాళ్ల కోరిక తీర్చింది. అయితే, ఫలితాన్ని చూసి ఆ జంట షాక్‌కు గురైంది. కారణం - జీబ్లీ స్టైల్‌లోకి మార్చిన ఇమేజ్‌లో మూడో వ్యక్తి (ఒక యువతి) కనిపిస్తోంది. వాస్తవానికి, వాళ్లు అప్‌లోడ్ చేసిన ఫొటోలో ఆ జంట తప్ప మరో వ్యక్తి లేదు, జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లో మాత్రం కనిపించింది. ఇది చూసి భయంతో వాళ్ల బట్టలు తడిచిపోయాయి.
ఇమేజ్ - 2
మరో సందర్భంలో, ఓ భారతీయ బెంగాలీ జంట వివాహ వేడుక జరుగుతోంది. ఆ ఫొటోను జీబ్లీ స్టైల్‌లోకి మార్చి చూస్తే, ఆ నూతన వధువు చేతిలో ఒక శిశువు ప్రత్యక్షమైంది. అంటే, ఛాట్‌జీపీ భవిష్యత్‌ను ఊహించి, ఇంకా పుట్టని శిశువును పెళ్లి రోజే తీసుకొచ్చి వధువు చేతిల్లో పెట్టింది. ఈ ఇమేజ్ చూసిన జనం నవ్వలేక చచ్చారు.
ఇమేజ్ - 3
ఛాట్‌జీపీటీ చేసిన మరో విచిత్రం - కొందరు భారతీయ మహిళలు వాయనాలు పట్టుకుని గుడికి వెళ్తున్న ఫోటోను ఛాట్‌జీపీటీలోకి అప్‌లోడ్ చేసి, స్టుడియో జీబ్లీ స్టైల్‌లోకి మార్చారు. వచ్చిన ఫలితం చూసి నివ్వెరపోయారు. రూపాంతరం చెందిన ఆ చిత్రంలో, ఓ మహిళ పట్టుకున్న వాయనంలో కొబ్బరి కాయకు బదులు ఓ తలకాయ ఉంది. ఇదేందయ్యా ఇదీ అంటూ జనం ముక్కున వేలేసుకున్నారు.
ఇమేజ్ - 4
మరో ఇమేజ్ చూస్తే - ఓ పెళ్లిలో వధూవరులతో కలిసి ఓ మహిళా అతిథి కలిసి ఫొటో దిగారు. ఛాట్‌జీపీటీ జీబ్లీ స్టైల్ ఆ ముగ్గురికీ పెళ్లయినట్లు ఓ ఇమేజ్ క్రియేట్ చేసింది.
విచిత్రాల వెనుకున్న కారణం ఇదీ
ఛాట్‌జీపీటీ జీబ్లీ స్టైల్‌లో ఇలాంటి భయపెట్టే సంఘటనలు, విచిత్రాలు చాలా జరిగాయి. నిజానికి అక్కడ ఎలాంటి దయ్యాలు, భూతాలు లేవు. ఛాట్‌జీపీటీ మనిషి కాదు, మనుషులకు ఉండే కామన్‌సెన్స్ దానికి లేదు. శిక్షణలో లోపం లేదా ఫొటోలో ఉన్న వివిధ వస్తువులు, బొమ్మలు, విగ్రహాలు లేదా ఆకారాలను అది సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నట్లు సాంకేతికత నిపుణులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

