Pet Into A Human: విఠలాచార్య మాయాజాలం, పెంపుడు జంతువులు మనుషుల్లా మారుతున్నాయ్!
ChatGPT's Newest Trend: చాట్‌జీపీటీ మరో అడుగు ముందుకు వేసింది, మీ పెంపుడు జంతువును (Pet) మనిషిలా మార్చి చూపిస్తోంది. ఇప్పుడు ఇదే నయా ట్రెండ్.

Turn Your Pet Into A Human With ChatGPT: ఇప్పుడు నెటిజన్లంతా ఛాట్‌జీపీటీ జపం చేస్తున్నారు. AI ఫ్లాట్‌ఫామ్ ఛాట్‌జీపీటీని ఉపయోగించుకుని, తమ ఫోటోలను రకరకాల సైల్స్‌లోకి మార్చుకుని మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు, స్టూడియో జిబ్లీ ఫిల్టర్, డిస్నీఫికేషన్, పిక్చర్ వంటివి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆధునిక కాలం చాలా వేగంగా పరిగెడుతోంది, ఇప్పుడు ఈ స్టైల్స్‌ను మర్చిపోయే టైమ్ వచ్చింది. కొత్త ట్రెండ్ ఏంటంటే.. పెంపుడు జంతువులను మనిషి రూపంలోకి మార్చడం. లెజెండరీ మూవీ డైరెక్టర్ విఠలాచార్య సినిమాలు గుర్తుకొస్తున్నాయా?
జంతువులను మనుషుల్లా మార్చే సాంకేతికత
సోషల్ మీడియా ప్రజలు ఇప్పుడు తమ పెంపుడు జంతువుల ఫోటోలను ChatGPTలోకి (ఇమేజ్ ఇన్‌పుట్ ఎనేబుల్ చేసిన వెర్షన్) అప్‌లోడ్ చేస్తున్నారు, “నా పెంపుడు జంతువు ఒక మనిషిలా మారితే ఫలితం ఎలా ఉంటుంది?” (What would my pet look like as a person? The results?) అని అడుగుతున్నారు. మీరు కూడా పిల్లి, కుక్క, కోడి, చేప, గుర్రం లేదా మరేదైనా జంతువు లేదా పక్షిని పెంచుకుంటున్నారా?. ఇంకా ఎందుకు ఆలస్యం?, మీ క్యూట్ పెట్ ఫోటో తీసి ఛాట్‌జీపీటీలోకి అప్‌లోడ్ చేయండి, అది మనిషిలా మారితే ఎలా ఉంటుందో అడగండి. ఫలితం చూసి ఆశ్చర్యపోవడమే కాదు చిన్నపిల్లల్లా సంబరపడతారు.
ఛాట్‌జీపీటీ మీరు ప్రేమించే పెంపుడు జంతువును మనిషి రూపంలోకి మార్చడమే కాదు, అది ఎలాంటి జాబ్ చేస్తే బాగుంటుందో కూడా చిత్రం రూపంలో చెబుతుంది. అంటే.. సిగ్గు పడే మీ పిల్లి లైబ్రేరియన్‌గా మారొచ్చు, మీ డాగ్ స్ట్రీట్‌వేర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లా కనిపించొచ్చు. ఠీవిగా నిలబడ్డ గుర్రం కోటు, బూటుతో బిజినెస్‌మ్యాన్‌లో మారిపోవచ్చు. మీ పెట్‌కు మానవ సౌందర్యాన్ని ఆపాదించి, ఆ లక్షణాల ఆధారంగా ఛాట్‌జీపీటీ ఒక జాబ్‌ను దానికి క్రియేట్ చేస్తుంది.
మీ పెంపుడు జంతువును మనిషి రూపంలోకి ఎలా మార్చాలి (How To Humanise Your Pet)
ChatGPTలోని ఇమేజ్ ఫీచర్‌ని ఉపయోగించి మీ పెంపుడు జంతువు ఫోటోను అప్‌లోడ్ చేయండి.
“What would my pet look like as a person?” అని టైప్ చేయండి
ఇంకా మెరుగైన ఫలితం కావాలంటే, ఈ క్రింది ప్రాంప్ట్‌ను కూడా ఉపయోగించండి:
“Remove fur or any animal-like part but retain the resemblance and overall personality. The result should feel like a believable human version”
ఇది ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్‌లోకి వచ్చింది?
ఎప్పుడూ, పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయలేని మానసిక బంధం ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్‌లా మన ఇంటిలో తిరిగే పెట్ హఠాత్తుగా మనిషి రూపంలోకి మారితే ఎలా ఉంటుందన్న ఉత్సుకత అందరికీ ఉంటుంది. ఇది సృజనాత్మకత కూడుకున్న విషయం & పైగా మనుషుల మనస్సుల లోతులను తాకుతుంది. ఎమోషనల్ టచ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

