అన్వేషించండి

Trump Tariffs: 'పాజ్‌' బటన్‌ నొక్కడంలో ట్రంప్‌ ప్లాన్‌ ఏంటి, మిగతా ప్రపంచాన్ని ఎందుకు ఒదిలిపెట్టాడు?

Donald Trump Raise Tariffs On China: పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల నుంచి ట్రంప్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. దీని గురించి కూడా ట్రంప్‌ మాట్లాడారు.

China - US Reciprocal Tariff War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), యూఎస్‌ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విధించిన అధిక సుంకాల రేట్లకు 90 రోజుల విరామం ఇచ్చి పెద్ద ఉపశమనం కలిగించారు. వాస్తవానికి, ఆ అధిక సుంకాలు బుధవారం (09 ఏప్రిల్‌ 2025) నుంచి అమల్లోకి రావలసి ఉండగా, చివరి నిమిషంలో "పాజ్‌" బటన్‌ నొక్కారు. కానీ, చైనాపై సుంకాన్ని 125 శాతానికి పెంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 46 దేశాలు & యూరోపియన్ యూనియన్‌ (EU)పై సుంకాలు విధించిన తర్వాత, గ్లోబల్‌ మార్కెట్లలో నెలకొన్న గందరగోళం, మాంద్యం ముప్పు కారణంగా ట్రంప్ తన నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నారు.  

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, పారిశ్రామికవేత్తలు & పెట్టుబడిదారుల నుంచి ట్రంప్‌నకు తీవ్రమైన నిరసన, ఒత్తిడి ఎదురైంది. సుంకాలు పెంచుకుంటే వెళ్లడం "సెల్ఫ్‌ గోల్‌"తో సమానమని, "బూమరాంగ్‌" అవుతుందని, "తాను తీసిన గోతిలో తానే పడడం" వంటిదని చాలా మంది హెచ్చరించారు. అమెరికాలో మరో ఆర్థిక మాంద్యానికి ‍‌(Economic Recession) ట్రంప్‌ కారణమవుతున్నారని రీసెర్చ్‌ హౌస్‌లు హెచ్చరించాయి. సుంకాలు పెంచుకుంటూ వెళ్లడం ఆర్థిక ఆణు యుద్ధంతో సమానమని, దాని పరిణామాలను అమెరికానే ఎక్కువగా భరించాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా వెనక్కు తగ్గని ట్రంప్‌, చివరి నిమిషంలో టారిఫ్‌లకు 90 రోజుల విరామం ప్రకటించారు. 

ట్రంప్‌ ఏం చెప్పారంటే?
వాణిజ్య భాగస్వామ్య దేశాలపై హైయ్యర్‌ టారిఫ్స్‌, దాని పరిణామాలపై ట్రంప్‌ను అంతర్జాతీయ మీడియా ప్రశ్నించినప్పుడు, "ప్రజలు కొంచం ఎక్కువగా ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నా. నన్ను కొంచెం చికాకు పెడుతున్నారు, ఇంకొంచం భయపెడుతున్నారు. అమెరికా భవిష్యత్‌ కోసం గతంలో ఏ ఇతర అధ్యక్షుడు ఇలా చేయలేదు. దీనికోసం ఎవరో ఒకరు ముందడుగు వేసి ఉండాల్సింది. మిగిలిన ప్రపంచం అమెరికాను దోచుకోవడం ఇంకా ఎక్కువ కాలం కొనసాగకూడదు, కాబట్టి నేను దీనిని ఆపవలసి వచ్చింది. ఎవరో ఒకరు చేయాల్సిన ఈ పనిని నేను చేసినందుకు గౌరవంగా భావిస్తున్నా" అని ట్రంప్‌ చెప్పారు.

చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 104 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు, ఇది గురువారం (ఏప్రిల్ 10, 2025) అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. ట్రంప్‌ ప్రకటన ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది.

మిగతా ప్రపంచాన్ని ట్రంప్‌ ఎందుకు ఒదిలిపెట్టారు?
యూఎస్‌ ప్రతీకార సుంకాలపై చైనా తప్ప మరే ఇతర దేశం కూడా ప్రశ్నించలేదు, సుంకాలను పెంచలేదు. ఇక్కడ, ట్రంప్‌ అహం (ఇగో) సంతృప్తి చెందినట్లు కనిపిస్తోంది. చైనా మాత్రం మాటకు మాట, సుంకానికి సుంకం అన్నట్లు ప్రతిస్పందించడంతో ట్రంప్‌ అసహనంగా ఉన్నారు. సాధారణంగా, "ప్రపంచంలో అందరికన్నా మేమే గొప్ప" అని అమెరికన్లు అనుకుంటారు. డొనాల్డ్‌ ట్రంప్‌ దగ్గర ఈ ఫీలింగ్‌ ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని ఆయన వైఖరిని బట్టి అర్ధం అవుతుంది. 

చాలా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై పరస్పర సుంకాల అమలుకు తాను బ్రేక్ వేస్తున్నానని, ఎందుకంటే అవన్నీ ప్రతీకార సుంకాలు వేయకుండా చర్చల కోసం తమను సంప్రదించాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.  చైనా తనను గౌరవించలేదని ఆరోపించారు. అంటే.. చైనాపై 125% విధించి, మిగిలిన దేశాలను 10%తో ఒదిలేయడానికి ట్రంప్‌ ఇగోనే కారణమన్నది చాలామంది అభిప్రాయం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
BCCI Red Alert: ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
ఆ హైదరాబాద్ వ్యాపారితో జాగ్రత్త- ఐపీఎల్‌ యాజమాన్యాలు, జట్లకు బీసీసీఐ హెచ్చరిక!
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Balakrishna: 'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
'జాట్' సక్సెస్ తర్వాత బాలకృష్ణతో... 'వీర సింహా రెడ్డి' కాంబో రిపీట్!
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
Embed widget