అన్వేషించండి

Israel Attack on Iran: ఇరాన్‌పై వార్ ప్రకటించిన ఇజ్రాయెల్! టెహ్రాన్‌ సహా అనేక ప్రాంతాలపై క్షిపణులతో దాడి!

Israel Attack on Iran: ఇజ్రాయెల్ ఇరాన్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. పేలుళ్లతో టెహ్రాన్‌తో సహా అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.  

Israel Attack on Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది, దీనిని "ముందస్తు దాడి"గా అభివర్ణించింది. ఈ ఘటన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశవ్యాప్తంగా "ప్రత్యేక, శాశ్వత అత్యవసర పరిస్థితిని" ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మధ్య ప్రాచ్యం మరోసారి యుద్ధ మేఘాల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. శనివారం తెల్లవారు జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ నగరంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై తాము దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ అధికారికంగా ప్రకటించడమే కాకుండా, ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామం అటు అమెరికాను, ఇటు అరబ్‌ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

టెహ్రాన్‌లో పేలుళ్లు:

ఇరాన్ రాజధాని టెహ్రాన్ కేంద్ర ప్రాంతంలో మూడు ప్రాంతాల్లో పెద్ద పేలుళ్లు వినిపించాయి. పేలుళ్ల తర్వాత భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఇరాన్ మీడియా తెలిపింది. టెహ్రాన్‌లోని రిపబ్లిక్ ప్రాంతంలో అనేక క్షిపణులు పడ్డాయని ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నష్టం లేదా ప్రాణనష్టంపై ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు.

శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్టు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు సంభవించిన ప్రాంతం నుంచి దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ఈ పేలుడుకు గల కారణాలపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇరాన్  అణు కార్యక్రమం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుళ్లు ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల ఫలితమేనని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. 

ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది, దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇజ్రాయెల్ ఇరాన్‌పై ప్రధాన దాడిని ప్రారంభించింది, టెహ్రాన్‌తో సహా అనేక చోట్ల పేలుళ్లు

ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్‌లు మోగాయి. ఈ హెచ్చరికలు ఇటీవల రిపోర్ట్ అయిన చర్యలకు నేరుగా సంబంధం కలిగి ఉన్నాయా అనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ఎటువంటి క్షిపణులను ప్రయోగించినట్లు ఆధారాలు లేవు. టెల్ అవీవ్, బెన్ గురియన్ విమానాశ్రయాల నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు. 

సురక్షిత ప్రదేశానికి ఖమేనీ 

ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లో లేరు. ఆయనను "సురక్షిత ప్రదేశానికి" తరలించినట్లు ఇరాన్ అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా నివేదించింది. సెంట్రల్ టెహ్రాన్‌లో కూడా దాడులు జరిగినట్లు నివేదించబడింది.

సురక్షిత ప్రదేశాల దగ్గర ఉండాలని ప్రజలను హెచ్చరించడానికి దేశవ్యాప్తంగా సైరన్లు మోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది . టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, క్షిపణి దాడికి సిద్ధంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తున్నట్లు సైన్యం తెలిపింది. దేశవ్యాప్తంగా సాధారణ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. పాఠశాలలు మూసివేశారు సమావేశాలు నిషేధించారు.. అవసరమైన సేవలు మినహా కార్యాలయాలు మూసివేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget