Viral News: పగబడితే అంతే -చాతిలో బుల్లెట్ ఇంప్లాంట్ చేయించుకుని మేయర్ పై ఆరోపణలు చేసిన మహిళ !
Bullet implanted: మేయర్ మనుషులు తనను కాల్చి చంపడానికి ప్రయత్నించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యంతో తన చాతిలో దిగబడిన బుల్లెట్ ను చూపించింది. కానీ పోలీసులు అసలు విషయం బయటకు తీశారు.

Bareilly: అది ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పోలీస్ స్టేషన్. ఓ మహిళ చాతి నుంచి రక్తం కారుతున్న స్థితిలో వచ్చింది. తనపై బరేలీ మేయర్ అత్యాచార యత్నం చేశారని.. చంపడానికి ప్రయత్నించారని.. బుల్లెట్ గాయం అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేయర్ అంటే సిటీ మొత్తానికి ప్రథమ పౌరుడు .. అయినా ఆమె బుల్లెట్ గాయంతో రావడంతో కేసు నమోదు చేసి ఆస్పత్రికి పంపించారు.
అయితే కేసు విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంకయ్యే విషయాలు తెలిశాయి. వైద్యం చేసిన పోలీసులు ఆ బుల్లెట్ నేరుగా తుపాకీ నుంచి వచ్చింది కాదని గుర్తించారు. అది ఇంప్లాంట్ చేసిందని చెప్పారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. ఓ డాక్టర్ కు రెండున్నర వేలు ఇచ్చి.. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బుల్లెట్ ను ఆమె తన శరీరంలోకి చొప్పించుకుంది. ఇదంతా కుట్ర కోసమే చేసింది. మామలుగా ఆరోపణలు చేస్తే నమ్మరని ఇలా బుల్లెట్ గాయంతో అయితే నమ్ముతారని మీడియాలో హైలెట్ అవుతుందని ఆమె డ్రామా ఆడారు.
పోలీసులు ఆమె ఏ ఆస్పత్రిలో బుల్లెట్ ఇంప్లాంట్ చేయించుకుందో మొత్తం వెలికి తీశారు. మొత్తం దృశ్యాలను తీసుకెళ్లి ఆమె ముందు పెట్టి అసలు ఎందుకు ఈ డ్రామా ఆడారో కూపీ లాగారు. ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు మరింత షాకయ్యారు.
ఆమె ఎవరంటే.. మేయర్ ఇంట్లో పని మనిషి. అయితే ఇప్పుడు కాదు. కొంత కాలం కిందట వరకూ పని చేసింది. ఆమె సరిగ్గా పని చేయడం లేదని చెప్పి మేయర్ భార్య పని నుంచి తీసేసింది. తనను పని నుంచి తీసేశారని కక్ష పెట్టుకున్న ఆమె .. రివెంజ్ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంది. గతంలో ఓ సారి మేయర్ పై ఆరోపణలు చేసింది. కానీ ఎవరూ నమ్మలేదు. అందుకే ఈ సారి బుల్లెట్ ఇంప్లాంట్ చేయించుకుని ప్లాన్ చేసింది.
ఇలా చేస్తే ఈజీగా దొరికిపోతారని తెలియని ఆమె అమాయక త్వానికి జాలి పడాలో... పని నుంచి తీసేస్తేనే మేయర్ పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రాణాల్ని రిస్కులు పెట్టుకున్నందుకు కోపగించుకోవాలో పోలీసులకూ ఆర్థం కాలేదు. కానీ చేసింది చిన్న తప్పు కాదు కాబట్టి ఆస్పత్రి నుంచి అరెస్టు చేసి జైలుకు పంపారు.
రాజకీయాల్లో ఉన్న వారిపై సులువుగా బండలేయవచ్చని ఆ మాజీ పని మనిషి అనుకున్నారు. కానీ పోలీసులు రాజకీయ నేతలపై వచ్చే ఆరోపణల్లో ఫేక్ ఉంటే ఇట్టే తేల్చేస్తారని.. పని ముషుల్లాంటి వారిని అసలు వదిలి పెట్టరని గుర్తించలేకపోయారు. అందుకే అరెస్టు అయ్యారు.





















