Viral Memes: అమెరికన్లను ఘోరంగా ట్రోల్ చేస్తున్న చైనా - ఏఐ వీడియోలు చూస్తే నవ్వాపుకోవాల్సిందే !
Viral AI videos : సుంకాల యుద్ధంలో అమెరికా, చైనా ఏఐ వీడియోల వార్ కూడా చేర్చుకున్నాయి. ముఖ్యంగా చైనా.. తమ నుంచి వస్తువులు రాకపోతే అక్కడి ఫ్యాక్టరీల్లో ట్రంప్, మస్క్ పని చేసుకోవాలని సెటైర్లు వేస్తోంది.

China mock Americans: అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం జరుగుతోంది. చైనా వస్తువులపై అమెరికా భారీగా పన్నులు విధించింది. తయారీ రంగానికి పెద్దన్నగా ఉన్న చైనా నుంచి అమెరికన్లకు పెద్ద ఎత్తున వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు పన్నులు పెద్ద ఎత్తున పెంచడంతో అమెరికన్లు ఇప్పుడు డాలర్ కు కొనాల్సిన వస్తువును రెండు డాలర్లకు కొనాల్సిన పరిస్థితి వస్తుందని సెటైర్లు వేస్తున్నారు. కొనలేకపోతే ఫ్యాక్టరీల్లో ట్రంప్ , మస్క్ వర్కర్లుగా చేరి వస్తువులు తయారు ఏఐ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు.
Viral AI Clip Shows 'Trump' Sewing in China After Tariffs Hit" #tariffs pic.twitter.com/Q3FeprgbnV
— MOHAMMAD AHSAN (@MOHAMMAD_AARSH) April 9, 2025
అమెరికాలో తయారీ రంగం కన్నా సేవల రంగం ఎక్కువగా అభివృద్ది చెందింది. యాపిల్ లాంటి కంపెనీలు అమెరికాకు చెందినవే అయినా యాపిల్ ఫోన్లను అత్యధికం చైనా, వియత్నాం, ఇండియా వంటి ప్రాంతాల్లో తయారు చేస్తారు. అమెరికాలో మేడిన్ చైనా ఫోన్లే అమ్ముడవుతాయి. ఇప్పుడు వాటి ధరలు పెరిగిపోతాయి. అందుకే చైనీయులు ఈ తరహా ట్రోల్స్ కోసం ఏఐ వీడియోలను సైతం తయారు చేస్తున్నారు.
China continues to roast the US with AI videos pic.twitter.com/gP1uvFBKI0
— Olga Nesterova (@onestpress) April 9, 2025
అమెరికన్లు కాస్త లావుగా ఉంటారు. వారి ఆహారపు అలవాట్లు అయినా.. ల మరో కారణం అయినా అమెరికన్లు ఓబేసిటీతో ఉంటారు. వారి బరువును కూడా చైనా ట్రోలర్లు వదిలి పెట్టడం లేదు.
China released an AI generated propoganda video that attempts to dissuade wanting American manufacturing by comparing those future factories to Chinese sweatshops. pic.twitter.com/7UvdkeRVAZ
— chris (@okiechristopher) April 9, 2025
మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనేది ట్రంప్ నినాదం.ఆ నినాదాన్ని ఈ వీడియోలతో కామెడీ చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైనా అంటే అక్కడి ప్రజల్ని ఫ్యాక్టరీల్లో కార్మికులుగా మార్చడం అన్నట్లుగా సెటైర్లు వేస్తున్నారు.
Me and the boys are practicing pic.twitter.com/CpFAENbrer
— Overheard on Wall Street (@OHWallStreet) April 6, 2025
నిజానికి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా వేశారు. అన్ని దేశాలు చర్చకు సిద్ధమని సంకేతాలు పంపాయని ఆయన చెప్పారు.కానీ చైనాపై మాత్రం ఆయన సుంకాలు పెంచుతూ పోయారు. ఎందుకంటే ఆ దేశం సుంకాలపై చర్చల గురించి మాట్లాడకుండా.. రివర్స్ లో అమెరికా వస్తువులపై సుంకాలు విధించింది. ఇది అమెరికా అధ్యక్షుడికి కోపం తెప్పించింది.అందుకే ఒక్క చైనాపై తప్ప అన్నింటిపైనా సుంకాలను వాయిదా వేశారు. అయితే చైనా మాత్రం ఏం తగ్గడం లేదు. అమెరికా పరిస్థితిని ఏఐ వీడియోలతో ట్రోల్ చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

