Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Akhanda 2 Collection Day 1: 'అఖండ 2'కు మొదటి రోజు థియేటర్ల దగ్గర మంచి సందడి కనిపిస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరి ప్రీమియర్స్ కలెక్షన్ ఎంతో తెలుసా?

'అఖండ 2 తాండవం'కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు ఈ సినిమా థియేటర్ల దగ్గర సందడి మామూలుగా లేదు. అభిమానులే కాదు... సినీ ప్రేక్షకులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (డిసెంబర్ 12న) 'అఖండ 2' రిలీజ్ అయ్యింది. అయితే ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి, ప్రీమియర్స్ కలెక్షన్ ఎంతో తెలుసా?
'అఖండ 2' ప్రీమియర్స్ @ 5.5 కోట్లు
'అఖండ 2 తాండవం' ప్రీమియర్ టికెట్ రేట్లు 600 రూపాయలకు అమ్మారు. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ ప్రీమియర్స్ వేశారు. మరి, స్పందన ఎలా ఉంది? ఎన్ని కోట్లు వచ్చాయి? అంటే...
తెలంగాణ (నైజాం) ఏరియాలో 'అఖండ 2' ప్రీమియర్స్ గ్రాస్ రూ. 2.35 కోట్లు. ఇక కర్ణాటక నుంచి మరో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఏపీలోనూ ఈ సినిమా సందడి కొనసాగింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే... ప్రీమియర్స్ కలెక్షన్ రూ. 5.5 కోట్లు. కేవలం ప్రీమియర్స్ ద్వారా పది కోట్ల రూపాయలు వచ్చాయని నిర్మాతలలో ఒకరైన రామ్ ఆచంట తెలిపారు. మొదటి రోజు కలెక్షన్ డబుల్ డిజిట్ దాటడం గ్యారంటీ. ఫస్ట్ డే ఎలా లేదన్నా 20 నుంచి 30 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేయవచ్చని ఒక అంచనా.
బాలకృష్ణ రుద్ర తాండవానికి ప్రశంసలు!
'అఖండ 2 తాండవం' గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. థియేటర్ల దగ్గర అభిమానుల స్పందన చూస్తుంటే... పూనకాలు వచ్చినట్టు అర్థం అవుతోంది. బాలయ్య రుద్ర తాండవం అందరికీ నచ్చుతోంది.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?
'సింహ', 'లెజెండ్', 'అఖండ' తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేసిన నాలుగో సినిమా 'అఖండ 2 తాండవం'. ఇందులో తాంత్రిక శక్తులు ఉన్న ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి, ఇతర కీలక పాత్రల్లో హర్షాలీ మల్హోత్రా & సంయుక్త నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ పతాకంపై ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు.





















