Akhanda 2 - Lord Shiva: 'అఖండ 2'లో శివుడు ఈయనే - హిందీలో వెరీ పాపులర్... ఇంతకు ముందు ఈ యాక్టర్ ఏం చేశారంటే?
Who Is Shiva In Akhanda 2: 'అఖండ'లో శివుని ప్రస్తావన ఉంది. బాలకృష్ణ 'అఖండ 2 తాండవం'లో ఏకంగా పరమేశ్వరుడిని చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. మరి శివునిగా నటించింది ఎవరో తెలుసా?

Lord Shiva Role In Akhanda 2 Movie: 'అఖండ 2 తాండవం'లో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం, ముఖ్యంగా పరమేశ్వరుని గుర్తు చేసేలా చేసిన రుద్ర తాండవం అభిమానులకు నచ్చుతోంది. 'అఖండ'లో శివుని ప్రస్తావన ఉంది. ఆ సినిమా పతాక సన్నివేశాల్లో శివుణ్ణి గుర్తు చేసేలా ఓ సీన్ రూపొందించారు. ఇప్పుడు సీక్వెల్ 'అఖండ 2 తాండవం'లో ఏకంగా పరమేశ్వరుని కైలాసం నుంచి కిందకు తీసుకు వచ్చారు. మరి ఆ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?
'అఖండ'లో పరమేశ్వరునిగా తరుణ్ ఖన్నా!
Who Is Tarun Khanna: 'అఖండ 2 తాండవం'లో పరమేశ్వరుని పాత్రను హిందీ నటుడు తరుణ్ ఖన్నా చేశారు. ఇంతకు ముందు శివునిగా నటించిన అనుభవం ఆయనకు ఉంది.
మైథలాజికల్ టీవీ సిరీస్ 'సంతోషి మా' (2015 - 17)లో మొదటిసారి శివునిగా నటించారు తరుణ్ ఖన్నా. ఆ తర్వాత 'కర్మఫల్ దాత శని', 'పరమావతార్ శ్రీ కృష్ణ' నుంచి మొదలు పెడితే 'శ్రీమద్ రామాయణ', ప్రస్తుతం 'కాల్ భైరవ రక్షక్ శక్తిపీఠ్ కే' వరకు పలు టీవీ సీరియళ్ళలో శివునిగా నటించారు తరుణ్ ఖన్నా. ఆయనను 'అఖండ 2 తాండవం'లో శివుని పాత్రకు తీసుకున్నారు బోయపాటి. అలవాటైన పాత్ర, ఇంతకు ముందు చేసిన అనుభవం ఉంటడంతో తరుణ్ ఖన్నా అవలీలగా నటించారు. తరుణ్ ఖన్నా పేరు చెబితే... శివునిగా ఆయన రూపం చూస్తే... హిందీ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది రాధాకృష్ణ సీరియల్. ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చినది అదే.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?
శివునిగా తరుణ్ ఖన్నా నటించడం వల్ల ఉత్తరాది ప్రేక్షకులకు సినిమా మరింత చేరువ అవుతుందని చెప్పవచ్చు. బాలకృష్ణతో తరుణ్ ఖన్నాకు సన్నివేశాలు లేవు. కానీ, ఓ సన్నివేశంలో ఇద్దరూ కనిపిస్తారు. అదెలా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీరియళ్లు మాత్రమే కాదు... స్టేజి షోలలోనూ పరమేశ్వరునిగా తరుణ్ ఖన్నా కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు అశుతోష్ రాణా ఉన్నారు కదా! ఆయన రావణుడిగా, తరుణ్ ఖన్నా శివుడిగా స్టేజి షోలు ఇచ్చారు.
View this post on Instagram
తరుణ్ ఖన్నాకు 'అఖండ 2 తాండవం' తొలి తెలుగు సినిమా. దీని తర్వాత ఇతర సినిమాల్లో శివుడి పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తారు ఏమో చూడాలి. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి 'అఖండ 2'కు మంచి స్పందన లభించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఎటువంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.























