Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Supreme court : సందేసరా సోదరులు రూ.5,100 కోట్లు డిపాజిట్ చేశారు.దాదాపు రూ.5,383 కోట్ల మోసానికి రెట్టింపు మొత్తం రికవరీ చేశారు.

Sterling Biotech case: భారతదేశంలోని పెద్ద బ్యాంకు మోసం కేసుల్లో ఒకటైన స్టెర్లింగ్ బయోటెక్ మోసంలో పాలుపంచుకున్న నితిన్ సందేసరా, చేతన్ సందేసరా సోదరులు సుప్రీం కోర్టులో రూ.5,100 కోట్లు డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్‌తో మొత్తం రికవరీ రూ.9,799 కోట్లకు చేరింది. వారిపై రూ.5,383 కోట్లు మోసం చేసినట్లుగా కేసులు ఉన్నాయి. దాదాపుగా రెట్టింపు సొమ్ము వారు జమ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం డిసెంబర్ 17 డెడ్‌లైన్ ముందే చేసిన ఈ చెల్లింపుతో, వారి వ్యతిరేకంగా ఉన్న క్రిమినల్ కేసులన్నీ ఉపసంహరించే అవకాశం ఏర్పడింది.
సందేసరా సోదరులు ఫార్మా , ఎనర్జీ సెక్టార్లలో ఉన్న స్టెర్లింగ్ బయోటెక్, స్టెర్లింగ్ ఫైబర్స్ వంటి కంపెనీల ప్రమోటర్లు. 2017లో వారు భారతదేశాన్ని వదిలి అల్బేనియా పాస్‌పోర్టులతో దేశం బయటకు వెళ్లిపోయారు. CBI ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, వారు బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణాలు మోసపూరితంగా పొంది ఎగ్గొట్టారు. ఈ మోసంలో పంచ్‌గావ్‌కర్ ఎక్స్‌పోర్ట్స్, మెక్స్‌కామ్, గ్రీన్‌పీస్ ఎనర్జీ వంటి కంపెనీలు కలిసి పనిచేశాయి. వీరిని 2018లో వారిని 'ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్'గా ప్రకటించారు. ఈ కేసులో భారతీయ బ్యాంకులు మాత్రమే కాకుండా, విదేశీ గ్యారంటర్లు కూడా బాధితులుగా ఉన్నారు. రుణాలు పొంది, డబ్బును విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం, ఫేక్ డాక్యుమెంట్లతో లెటర్స్ ఆఫ్ అండర్‌టేకిం పొందడం వంటివి జరిగాయి.
Supreme Court Clears Sandesara Brothers of Criminal Charges on ₹5,100-crore Settlement Offer https://t.co/6RScTlVbiz
— Moneylife (@MoneylifeIndia) November 24, 2025
via Moneylife App. Download Now : https://t.co/oCY4nDLtoz@suchetadalal @Moneylifers @yogtoday pic.twitter.com/NHPkht6JVv
2020లో అప్పులు ఇచ్చిన భారతీయ , విదేశీ బ్యాంకులు ఒక్కసారి సెటిల్‌మెంట్ (OTS) ప్రతిపాదించాయి. మొత్తం రూ.6,761 కోట్ల చెల్లింపుకు అంగీకరించారు. ఇందులో భారతీయ కంపెనీలకు రూ.3,826 కోట్లు, విదేశీ గ్యారంటర్లకు రూ.2,935 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. సందేసరా కుటుంబం 2020లో రూ.614 కోట్లు చెల్లించింది. తర్వాత 2021 నుంచి 2025 ప్రారంభం వరకు రూ.3,507 కోట్లు చెల్లించారు. అదనంగా, దివాలా తీసిన ఆస్తుల లిక్విడేషన్ ద్వారా రూ.1,192 కోట్లు కోర్టు రికవర్ చేసింది. తాజాగా రూ. 5100కోట్లు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు. దీంతో మొత్తం రికవరీ రూ.9,799 కోట్లకు చేరింది.
సుప్రీం కోర్టు నవంబర్ 19న బ్యాంకులు, పరిశోధన ఏజెన్సీలతో సంప్రదింపుల తర్వాత ఆర్డర్ జారీ చేసింది. కోర్టు, ఈ చెల్లింపు పూర్తయిన తర్వాత 2017 నుంచి ఫోరమ్‌లు, ప్రభుత్వ ఏజెన్సీల ముందు ఉన్న అన్ని కేసులను ముగించవచ్చని అనుమతించింది. CBI, ED వంటి ఏజెన్సీలు కూడా ఈ సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. ఈ సెటిల్‌మెంట్‌తో భారతీయ బ్యాంకులు, విదేశీ లెండర్లు తమ రుణాలను తిరిగి వసూలు చేసుకోగలిగాయి. సందేసరా సోదరులు ఇప్పటికే అమెరికాలో అరెస్ట్ అవ్వడంతో మెట్రోపాలిటన్ పోలీస్ కస్టడీలో ఉన్నారు.





















