Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
దేశవ్యాప్తంగా పైలట్ ఉద్యోగాలకు ఊహించని స్దాయిలో డిమాండ్ పెరిగింది. ఎంతలా ఉంటే రాబోయే 4ఏళ్లో ఏకంగా 30వేల మందికి పైగా పైలట్ లు అవసరం. దేశంలో విమానసర్వీలకు ఇండిగో సంక్షోభం తరహాలో , సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే పైలట్ ఉద్యోగాలు భర్తీచేయక తప్పని పరిస్దితి నెలకొంది. కేంద్ర విమానయాన సంస్ద సైతం పైలట్ ఉద్యోగాలపై క్లారిటీ ఇవ్వడంతోపాటు , అత్యవసరంగా పైలట్ లను భర్తీ చేయాల్సిన పరిస్దితులు ఇండిగో వంటి సంస్దల్లో ఇప్పటికే నెలకొంది. ఈ నేపధ్యంలో పైలట్ ఉద్యోగం సాధించాలంటే అర్హత ఏంటి, శిక్షణ ఖర్చులు, జీతాలు ,పదోన్నతులు ఎలా ఉంటాయి. పైలట్ కల నేరవేరాలనుకునే వారు ఈ అవకాశం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాలపై..తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ సీఈవో కెప్టెన్ ఎస్.ఎన్.రెడ్డి ప్రత్యేక ఇంటర్వూ.. ప్రత్యేకించి ఇండిగో సంక్షోభం దృష్టిలో పెట్టుకుని తర్వాతి తరం పైలెట్లు అప్రమత్తత అవ్వాల్సిన విధానంపై, కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై కీలక సూచనలు, సలహాలు ఈ ఇంటర్వ్యూలో.





















