అన్వేషించండి

Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?

Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో అనుభవానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నితీష్ ప్రమాణం చేస్తే ఎనిమిది మంది మాజీ సీఎంలు ఉన్నట్లు అవుతుంది.

Eight former CMs in the Union Cabinet:   కేంద్ర క్యాబినెట్ అనగానే అందరికీ ప్రధాని మోడీదే అన్నీ అన్న భావన ఉంటుంది. ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో మంత్రులుగా ఐతే మాజీ అధికారులు, లేదా కొత్తతరం నాయకులు ఎక్కువున్నారన్న అభిప్రాయం చాలామందికుంది. కానీ ప్రస్తుత కేంద్ర క్యాబినెట్లో అరడజనుమంది మాజీ సీఎంలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. పాలనా పరంగా చూస్తే జాతీయ స్థాయిలో ప్రధానికి ఉన్న అధికారాలెంతటివో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రికి అంతకంటే ఎక్కువే.

ప్రధానికూడా మాజీ సీఎమ్మే.. మరో ఆరుగురు మాజీ సీఎం లు

ప్రధానమంత్రి పదవి చేపట్టకముందు గుజరాత్ కు మూడు సార్లు సీఎం గా చేసిన అనుభవం మోదీకి పాలనపై గట్టు పట్టు దక్కేలా చేసింది. కేంద్ర ప్రభుత్వాదినేతగా మోదీ అన్నీ తానై ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతారు. కానీ ప్రధానితోపాటు తమ శాఖలపై పూర్తి అవగాహణ కలిగిన నాయకులు క్యాబినెట్లో చాలామందే వున్నారు. అమిత్ షా, నితిన్ గడ్కరీ లాంటి మంత్రులకు తమ శాఖలపై పూర్తి అవగాహణ, అధికారులపై పట్టుంది. వీరితోపాటు మరో ఆరుగురు మాజీ సీఎంలున్నారు.

ఎవరా మాజీ సీఎంలు..?

 రాజ్ నాథ్ సింఘ్.. బీజీపీ మాజీ అధ్యక్షుడిగా, కేంద్రంలో హోం, రక్షణ శాఖలకు మంత్రిగా చేసిన నాయకుడిగా నే ప్రధానంగా గుర్తొచ్చే రా రాజ్ నాథ్ సింఘ్  గతంలో ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా కూడా చేసారు. రాజకీయంగా అనేక చిక్కుముడులుండే రాష్ట్ర రాజకీయాలనుంచి వచ్చిన నేతగా రాజ్నాథ్ కి స్ధితప్రజ్ఞత అక్కడినుంచే అలవడిందని చెప్పొచ్చు.
శివరాజ్ సింఘ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, రాజకీయ నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, ఆర్ధిక సమాజిక అంశాలపై అవగాహణ శివరాజ్ సింఘ్ చౌహాన్ కు కేంద్ర క్యాబినెట్లో కూడా తనదైన ముద్రవేసేలా చేసింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి కీలకమైన వ్యవసాయ శాఖామంత్రిగా రైతాంగ వర్గాల్లో చౌహాన్ సింప్లిసిటీ, అనుభవం సానుకూలతనే తెస్తుంది.

మనోహర్ లాల్ ఖట్టర్.. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖామంత్రి. హర్యాణా మాజీ ముఖ్యమంత్రి గా రాష్ట్రంలో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఐదేళ్ళపాటు పాలనానుభవముంది. 

శర్వానంద సోనోవాల్..  మోడీ ప్రభుత్వంలో షిప్పింగ్ మంత్రిగానే కాకుండా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో అత్యంత కీలకమైన నాయకుడు. అస్సాం మాజీ ముఖ్యమంత్రిగా అక్కడి డైనమిక్స్ పూర్తిగా తెలిసిన నాయకుడు మాత్రమే కాదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల అమలు కిటుకులు తెలిసిన నేత.

కుమార స్వామి.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి.  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సంకీర్ణ రాజకీయాల విలువ తెలిసిన దక్షిణాది నేత. కర్నాటకలో రైతాంగ వర్గాల ఆదరణ కలిగిన పార్టీ నేత. 

జీతన్ రాం మాఝి.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి.. దళిత వర్గాల రాజకీయాల నేత. నితీష్ కుమార్ తో విభేదించిన తర్వాత స్వతంగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా పార్టీ ఏర్పాటు చేసి ఎన్డీయేలో చేరారు. 

ఇప్పుడు నితీష్ చేరికతో మరింత పెరగనున్న అనుభవం.. 

దాదాపు 20 సంవత్సరాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమారు తాజాగా రాజ్య సభ కు నామినేషన్ దాఖలుచేయడంతో పాటు. సీఎం పదవికి రాజీనామా చేస్తుండటంతో.. కేంద్రం లో ఆయనకు మంత్రి పదవి ఖాయంగానే కనిపిస్తోంది. గతంలో కూడా రైల్వే శాఖమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సీఎంగా పాలనానుభవం, సంకీర్ణ పార్టీల అవసరాలు తెలిసిన నేత నితీష్. ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి తిరిగి రాకను తాము ఆహ్వానిస్తున్నామని అమిత్ షా అన్నారు. 

త్వరలో చంద్రబాబూ వస్తారా..?

సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా చేసిన కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. ప్రాంతీయ పార్టీ అధినేతగా, సంకీర్ణ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో కీలకపాత్ర పోషించిన నాయకుడిగా చంద్రబాబు ప్రసిద్ధులు. ఆధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ, జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ త్వరలో రాష్ట్ర రాజకీయాలు తనయుడు లేకోష్ కి అప్పగించి తాను నితీష్ తరహాలో ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశముందని చర్చ నడుస్తోంది. ఐతే ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో మోడీ కన్నా కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు మోడీ క్యాబినెట్లో ఒక మంత్రిగా ఇమడగలరా.. చంద్రబాబు అనుభవం, పాలనా దక్షతను మోడీ ఎలా వినియేగించుకుంటారు లాంటి చర్చలూ రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. 
 
ఎన్డీయే మరో విజయం కోసమా.. !

ఇప్పటికే మూడు వరుస పర్యాయాలు కేంద్రంలో నెగ్గిన బీజేపీ 2024లో స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం సాధించుకోలేక పోయింది. సుదీర్ఘకాలం అధికారంలో వున్న నేపధ్యంలో వచ్చేసారి విజయం మరింత కష్టమవుతుంది. అందుకే సంకీర్ణంలో భాగస్వాములుగా వున్న పార్టీలను మరింత చేరువ చేసుకోవడం. ఆయా పార్టీల అధినేతలకు మరింత ప్రాధాన్యత కల్పించడం. వారితో మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం తీసుకునే వ్యూహంలో బాగంగానే బీజేపీ కేంద్రంలో ఈ సీనియర్లకు మంత్రివర్గంలో ప్రాధాన్యతనివ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. 

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget