అన్వేషించండి

WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి

కోల్‌కాతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భారత్ నిలబడటం అనుమానంగా మారింది. ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్‌ కెప్టెన్సీలో టీమిండియా.. మిగిలిన అన్ని టీమ్స్‌ కంటే చాలా ఎక్కువగా 8 టెస్ట్‌లు ఆడి.. అందులో కేవలం నాలుగు టెస్ట్‌ల్లో గెలిచి.. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ సైకిల్‌లో కేవలం 54.17 పాయింట్స్‌తో నాలుగో ప్లేస్‌కి పరిమితమైపోయింది. సాధారణంగా WTC ఫైనల్‌కు అర్హత పొందేందుకు అవసరమైన PTC 64% నుంచి 68% మధ్య ఉండాలి. కానీ టీమిండియా దగ్గర కేవలం 54 పర్సెంట్ పాయింట్సే ఉండటంతో.. ఇక్కడి నుంచి టీమిండియా టాప్-2లోకి చేరడం దాదాపు కష్టంగా కనిపిస్తోంది. అయితే అసాధ్యమైతే కాదు. ఎందుకంటే.. భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్, శ్రీలంక, న్యూజిల్యాండ్‌లతో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లు, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో దాదాపు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్ గెలవాలి. అప్పుడే భారత్‌ డబ్ల్యూటీసీ టాప్2లోకి చేరే అవకాశం ఉంటుంది. స్టాటిస్టికల్‌గా మాట్లాడుకుంటే.. మొత్తం 10 మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే.. 79.63 పాయింట్లు, ఒక మ్యాచ్‌లో ఓడిపోయి 9 మ్యాచ్‌ల్లోనే గెలిస్తే.. 74.07 పాయింట్లతో దర్జాగా టాప్2లోకి చేరుకుంటాం. అదే 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి 8 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 68.52 శాతం పాయింట్లతో అతి కష్టం మీద టాప్2కి క్వాలిఫై అవుతాం. ఇక 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయామంటే మనం టాప్2 చేరడం అసాధ్యమే. ఎందుకంటే.. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. 7 మ్యాచ్‌ల్లోనే గెలిస్తే.. మన పాయింట్లు 62.96 పర్సెంట్‌ పాయంట్లు మాత్రమే సాధిస్తాం. టాప్‌2లో అడుగుపెట్టాలంటే అది సరిపోదు. అంటే ఫైనల్ ఆడాలంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ అప్‌కమింగ్ 10 మ్యాచ్‌ల్లో టీమిండియా ఎట్టిపరిస్థితుల్లో 2 మ్యాచ్‌లకు మించి ఓడిపోకూడదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 100 పర్సెంట్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంటే.. సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 66.67 పాయింట్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక శ్రీలంక కూడా 2 మ్యాచ్‌ల్లో 1 గెలిచి 66.67 పాయింట్స్‌తో మూడో ప్లేస్‌లో ఉంది.

ఆట వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 RR VS SRH Result Update: రాయ‌ల్స్‌ విజయాలకు బ్రేక్ వేసిన స‌న్ రైజ‌ర్స్! చెరో నాలుగేసి వికెట్ల‌తో ప్ర‌ఫుల్, స‌కీబ్ డెబ్యూ !
రాయ‌ల్స్‌ విజయాలకు బ్రేక్ వేసిన స‌న్ రైజ‌ర్స్! చెరో నాలుగేసి వికెట్ల‌తో ప్ర‌ఫుల్, స‌కీబ్ డెబ్యూ !
Jasprit Bumrah News: వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
వికెట్ లెస్ బుమ్రా.. ముంబై ఇండియన్స్ పేసర్ గురించి అశ్విన్ రీప్లై..
Praful Hinge Dream Debut: ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
ఎస్ఆర్‌హెచ్‌ నయా సెన్సేషన్ ప్రఫుల్ హింగే ఎవరు? తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు! ఐపీఎల్ హిస్టరీలోనే అరుదైన ఫీట్!
వాంఖడేలో రికార్డుల మోత.. 11 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన ఆర్సీబీ, ముంబై
వాంఖడేలో రికార్డుల మోత.. 11 ఏళ్ల రికార్డు బద్ధలుకొట్టిన ఆర్సీబీ, ముంబై

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget