Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది. కానీ.. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మ్యచ్‌కి ముందు నుంచే శుభ్‌మన్ గిల్ రూపంలో జట్టుని పెద్ద సమస్య వెంటాడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయంతో మ్యాచ్ నుంచే తప్పుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క బాల్ ఆడి.. రిటైర్ అయిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే రాలేదు. అంతేకాకుండా.. మెడ గాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కూడా అయిన గిల్.. ట్రీట్‌మెంట్ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ రెండో మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? ఫుల్ ఫిట్‌గా ఉంటాడా? అనే అనుమానం అందరిలో కనిపిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం గిల్ విషయంలో తొందరపడకూడదని, వైద్యులతో సంప్రదించిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటోందట. ఒకవేళ ఏ మాత్రం డాక్టర్ల నుంచి గిల్‌కి రెస్ట్ అవసరం అనే సంకేతాలు వచ్చినా విశ్రాంతి ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందని కొందరు అఫీషియల్స్ చెబుతున్నారు. అంటే పరిస్థితులని బట్టి రెండో టెస్ట్‌లో గిల్ ఆడేది దాదాపు డౌట్‌గానే కనిపిస్తోంది. అయితే ఇలాంటి టైంలో శుభ్‌మన్ స్థానంలో రెండో టెస్ట్‌లో ఎవరిని ఆడిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఈ ప్లేస్ కోసం ప్రస్తుతం మూడు పేర్లు వినిపిస్తున్నాయి. యంగ్ సెన్సేషన్ సాయి సుదర్శన్.. ఆర్సీబీ స్టార్ ఓపెనర్, కెప్టెన్ దేవ్‌దత్ పడిక్కల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. గిల్ అవుట్ అయిపోతే.. సాయి లేదా పడిక్కల్‌లో ఒకరిని టీమ్‌లోకి తీసుకోవాలని కోచ్ గంభీర్ అనుకుంటున్నాడట. కానీ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం.. వీళ్లిద్దరి కంటే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గౌక్వాడ్‌ని టీమ్‌లోకి తీసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నాడు. ‘రుతురాజ్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా అదరగొడుతున్నాడు. స్టాటిస్టిక్స్ విషయంలో కూడా గిల్ కంటే మెరుగ్గా ఉన్నాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కూడా టెస్ట్‌లకి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రుతురాజ్ ఓపెనర్ కావడం టీమ్‌కి మరో ప్లస్ పాయింట్. అందుకే గిల్ ప్లేస్‌లో అతడ్నే టీమ్‌లోకి తీసుకోవాలి’ అని చెబుతున్నాడు. మరి మీరేం అంటారు? రుతురాజ్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్.. వీల్లు ముగ్గురిలో ఎవరిని తీసుకుంటే బెటర్ అని మీరనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.





















