అన్వేషించండి

HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?

IPL : ఐపీఎల్ టిక్కెట్ల గోల్ మాల్ పై విజిలెన్స్ దర్యాప్తు జరుగుతోంది. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్టేడియంలో తనిఖీలు నిర్వహించారు

  Vigilance probe underway into IPL ticket scam: ఉప్పల్ స్టేడియం లో విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్ రాజ్ ,ట్రెజరర్ శ్రీనివాస్ తో సమావేశం అయి టిక్కెట్ల దుర్వినియోగం  పై ఆరా తీశారు. శనివారం ఉప్పల్లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియను ఎలా చేస్తున్నారన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్ లపై ఆరోపణలు వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి వచ్చే ప్రతి కాంప్లిమెంటరీ టికెట్ మొదటగా చేరుకునేది వీళ్లిద్దరు వద్దకే కాబట్టి వీరిద్దరి నుండే టికెట్టు పక్కదారు పట్టినట్టు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులు

స్టేడియంలో కార్ పాసులు, బైక్ పాసులు తన సొంత మనుషులకే జారీ చేస్తున్నట్టు అభియోగాలు ఉన్నాయి. కాంప్లిమెంటరీ టికెట్లు చాలావరకు పక్కదారి పట్టినట్లు భావిస్తున్న విజిలెన్స్ అధికారులు ఈ దిశగా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీ విషయంలో కీలకపాత్ర వహిస్తున్న సెక్రటరీ దేవరాజ్ ట్రెజరర్ శ్రీనివాస్ గురించి పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. ఒప్పందం ప్రకారం 10% కాంప్లిమెంటరీ టికెట్లు హెచ్సీఏ కి వస్తున్నా... సన్ రైజర్స్  వాళ్ళు తక్కువగా ఇస్తున్నారు అంటూ బయట ప్రచారం చేసి.. తమ వర్గానికి టికెట్లను పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. 

రాచకొండ పోలీసులు ఎక్కువ మొత్తంలో టికెట్లు తీసుకుంటున్నారంటూ బయట ప్రచారం చేసిన సెక్రటరీ వ్యవహారాన్ని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మ్యాచ్ లు జరుగుతున్న విధి నిర్వహణలో పోలీసులు ఉంటారు. వారికి పాసులు ఇవ్వరు. అవి కాకుండా ఎవరికైనా పాసులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇస్తారు కానీ పోలీసు శాఖ కోసం ఇవ్వరు. ఈ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆరా తీసి.. అక్రమాలను బయట పెట్టి  కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఉచిత టిక్కెట్ల కోసం వేధింపులు పెరిగిపోయాయని   సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యం ఆరోపణలు చేసింది. ఈ వివాదం విషయంలో సీఎం రేవంత్ విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు.  ఆ తర్వాత హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ ఓ ఒప్పందానికి వచ్చాయి.  ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలాంటి చిన్న పనిచేయాలని అడగబోమని రాసిచ్చారు.    బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేర‌కు ప‌ని చేసేందుకు ఇరు వ‌ర్గాలు అంగీకారం తెలుపుతూ ఓ నిర్ణయం తీసుకున్నారు.  పాత ఒప్పందం ప్ర‌కార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం  కాంప్లిమెంట‌రీ పాసుల కేటాయిస్తారు. అంతే తప్ప.. ఇక హెచ్‌సీఏ అధ్యక్షుడు బ్లాక్ మెయిల్ చేశారని వేరే బాక్సులు.. ఇతర టిక్కెట్లు ఇచ్చే చాన్స్ లేదని ఎస్ఆర్‌హెచ్ స్పష్టం చేసింది. ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది.  చర్చలు పూర్తయిన తరవాత   ⁠వివాదాల‌న్ని ముగిశాయని  హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ సంయుుక్తంగా ప్రకటించాయి.                       

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
Uppal Balu : థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు
థార్ కారుపై ఉప్పల్ బాలు స్టంట్స్ - రీల్స్ పిచ్చితో వెకిలి చేష్టలు... కేసు నమోదు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget