Virat Kohli Animated Discussion: కింగ్ కోహ్లీకి కోపమొచ్చింది.. మెంటార్ దినేశ్ తో యానిమేటెడ్ చర్చ.. కెప్టెన్ రజత్ పై అసంతృప్తి!
ఈ సీజన్లో సొంతగడ్డపై ఆడిన మ్యాచ్ ల్లో ఆర్సీబీ తేలిపోతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ ఓడిపోయింది. దీంతో స్టార్ బ్యాటర్ కోహ్లీ అసహనానికి లోనయ్యాడు. మెంటార్ దినేశ్ తో దీనిపై చర్చించాడు.

IPL 2025 RCB VS DC Updates: భారత స్టార్ విరాట్ కోహ్లీకి కోపమొచ్చింది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా తను చాలా యానిమేటెడ్ గా కనిపించాడు. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 6 వికెట్లతో సునాయసంగా ఢిల్లీ గెలుపొందింది. మ్యాచ్ మధ్యలో కెప్టెన్ రజత్ పతిదార్ పై అసంతృప్తితోనే కోహ్లీ ఇలా ప్రవర్తించాడని మ్యాచ్ కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. నిజానికి ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతోనే ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత ఒక దశలో పవర్ ప్లేలో డీసీని బాగా కట్టడి చేసి, మూడు వికెట్లు తీసినా.. ఆ తర్వాత పట్టు కోల్పోయి ఓటమి పాలైంది. లోకల్ ప్లేయర్ కేఎల్ రాహుల్ విధ్వంసక ఫిఫ్టీ (53 బంతుల్లో 93 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు)తో జట్టును ఒంటరిగా విజయతీరాలకు చేర్చాడు. ఇక జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ తో కోహ్లీ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లతో హెరెత్తిస్తున్నారు.
True. He had a long discussion with DK...then he spoke with Bhuvi .. he didn't even join the group while the last strategic time out.
— KC (@chakriMsrk) April 10, 2025
He was not happy with something for sure.
Video credit: @JioHotstar pic.twitter.com/0pAXuDWP0w
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
డీసీ బ్యాటింగ్ చేస్తున్నప్పడు ఒకనొక దశలో బౌండరీ లైన్ వద్ద విరాట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మెంటార్ దినేశ్ కార్తీక్ తో ఏదో చర్చిస్తూ కనిపించాడు. కాస్త యానిమేటెడ్ గా మైదానం వైపు చేతులు చూపిస్తూ, ఏదో చెబుతూ కనిపించాడు. దానికి దినేశ్ అవునంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఏదో కంప్లయింట్ చేస్తున్నట్లు విరాట్ బాడీ లాంగ్వేజీ కనిపించింది. నిజానికి దినేశ్ తో అతను ఏం మాట్లాడాడో స్పష్టత లేకపోయినప్పటికీ, కెప్టెన్ రజత్ పై కాస్త అసంతృప్తితోనే చర్చి జరిపినట్లు ప్రచారం అవుతోంది.
బ్యాటింగ్ వైఫల్యంతోనే..
ఇక డీసీతో ఓటమిపై రజత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ వైఫల్యంతోనే జట్టు ఓటమిపాలైందని విమర్శించాడు. ఒక దశలో మంచి ఆరంభం లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేదని, 80/1 నుంచి 90/4 గా మారడం ఎంతమాత్రం సరికాదని మండిపడ్డాడు. బ్యాటర్లు సరైన ఇంటెంట్ తో బ్యాటింగ్ చేయాలని సూచించాడు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (37) తో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనను సునాయసంగా ఢిల్లీ పూర్తి చేసింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసి గెలుపొందింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫిఫ్టీ తో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఈ సీజన్లో నాలుగో విజయం సాధించిన రెండో జట్టుగా గుజరాత్ టైటాన్స్ సరసన నిలిచింది. మొత్తానికి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

