దీపావళి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అమావాస్య నాడు జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఆక్టోబర్–నవంబర్‌ల్లో ఉంటుంది.
దీపావళి 2025
FAQs
దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు?
దీపావళి ఎందుకు జరుపుకుంటారు?
దీపావళి అంటే దీపాల పండుగ. చెడుపై మంచి గెలుపును సూచిస్తూ ఆనందంగా చేసుకునే పండగ. నాడు శ్రీరాముడు లంకలో రావణుడిని వధించిన తర్వాత అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళి ఎందుకు ముఖ్యమైనది?
దీపావళి మంచి విజయానికి చిహ్నాంగా చేసుకునే వేడుక. ఈ పండగ ఆనందంతోపాటు శాంతిని, సంపదను ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే కారణంగా “లక్ష్మీపూజ” చేసి ఆశీర్వాదం తీసుకుంటారు.
దీపావళి రోజు ఏ ఆచారాలు పాటిస్తారు?
ఇంటిని శుభ్రం చేయడం, దీపాలు వెలిగించడం, లక్ష్మీ పూజ చేయడం, స్వీట్లు పంచడం ముఖ్య ఆచారాలు. కొత్త బట్టలు ధరించి, బాణసంచా కాల్చడం కూడా సాంప్రదాయం.
దీపావళి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు?
దీపాలు చీకటిని తొలగించి, జ్ఞానం, సంతోషం, సంపదను ఇస్తాయని చెబుతారు. రాముడి రాకను స్వాగతించేందుకు అయోధ్యలో దీపాలు వెలిగించారని నమ్ముతారు.













