PM Modi Diwali 2025 Celebrates: దీపావళిని నేవీ సిబ్బందితో సెలబ్రేట్ చేసుకున్న పీఎం మోదీ, ఐఎన్ఎస్ విక్రమ్‌తో పాకిస్తాన్‌కు నిద్ర దూరమైందని కామెంట్స్
PM Modi Diwali 2025 Celebrates: దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ INS విక్రమ్ సందర్శించి నావికా దళానికి శుభాకాంక్షలు తెలిపారు. సైన్యం సహాసాలు బలాబలాలపై ప్రశంసలు కురిపించారు.

PM Modi Diwali 2025 Celebrates: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈసారి కూడా దేశ సైనికులతో దీపావళి జరుపుకున్నారు. ఈసారి ప్రధాని మోదీ దీపావళి వేడుకల కోసం గోవా, కరవార్ తీరంలో ఉన్న INS విక్రంత్ ని ఎంచుకున్నారు. ఇక్కడ ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత సైన్యం, వైమానిక దళం, ఇండియన్ నేవీ సమన్వయం పాకిస్తాన్‌ను ఆపరేషన్ సిందూర్‌లో మోకరిల్లేలా చేసిందని అన్నారు.
నేవీ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, సొంతంగా పోరాడే ధైర్యం ఉన్నవారిదే ఎప్పుడూ పైచేయిగా ఉంటుందని అన్నారు. ఆయన మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్‌లో మూడు దళాల భాగస్వామ్యం మన సైన్యం అత్యంత బలమైనదని నిరూపించింది. ధైర్యవంతులైన సైనికులు పాకిస్తాన్‌ను మోకరిల్లేలా చేశారు. శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు, యుద్ధం జరిగే అవకాశం ఉన్నప్పుడు, సొంతంగా పోరాడే ధైర్యం ఉన్నవారిదే ఎప్పుడూ పైచేయిగా ఉంటుంది.' అని అన్నారు.
ప్రధాని మోదీ ఈ ముఖ్యమైన విషయం చెప్పారు
ప్రధాని మోదీ మాట్లాడుతూ తన ముందు సముద్రం, తన వెనుక భారతమాత వీర సైనికులు ఉన్నారని అన్నారు. ఆయన INS విక్రంత్‌ను అనంత శక్తుల చిహ్నంగా అభివర్ణించారు. సముద్రంపై సూర్య కిరణాలు, సైనికులు వెలిగించిన దీపాలు కలిసి దీపావళికి ప్రత్యేక కాంతులను ఇస్తున్నాయని అన్నారు. సైనికుల దేశభక్తి, ఉత్సాహాన్ని ప్రధాని ప్రశంసిస్తూ, నిన్న రాత్రి వారు దేశభక్తి గీతాలు పాడటం చూశానని, ఆపరేషన్ సిందూర్‌ను వినడం ద్వారా యుద్ధభూమిలో నిలబడిన సైనికుడి అనుభూతిని తాను అనుభవించానని అన్నారు. పెద్ద నౌకలు, విమానాలు, జలాంతర్గాములు ఆకట్టుకుంటాయని, కానీ నిజమైన శక్తి వాటిని నడిపే ధైర్యవంతులైన సైనికులలో ఉందని ఆయన నొక్కి చెప్పారు.
Celebrating Diwali with our brave Navy personnel on board the INS Vikrant. https://t.co/5J9XNHwznH
— Narendra Modi (@narendramodi) October 20, 2025
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "మన భద్రతా బలగాల పరాక్రమం, ధైర్యం కారణంగా గత సంవత్సరాల్లో దేశం మరో గొప్ప విజయాన్ని సాధించింది. ఆ విజయం ఏమిటంటే - మావోయిస్టుల నిర్మూలన."
ప్రధాని మోదీ సైనికుల అంకితభావం, కృషి, ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఈ అనుభవంతో సైనిక జీవితంలోని కష్టాలను, శక్తిని తెలుసుకున్నట్టు తెలిపారు. ఈ దీపావళి పండుగను నౌకాదళ వీర సైనికుల మధ్య జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఆయన అన్నారు.
"ఆత్మనిర్భర్‌త దిశగా మన సైన్యం అడుగులు"
ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచంలోని టాప్ డిఫెన్స్ ఎగుమతి చేసే దేశాలలో ఒకటిగా మారడమే తమ లక్ష్యమని అన్నారు. గత దశాబ్ద కాలంగా మన సైన్యం వేగంగా ఆత్మనిర్భర్‌త దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు. మన సైన్యం ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదనుకుంటున్న వస్తువుల జాబితాను తయారు చేసిందని ఆయన అన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "భారత నౌకాదళం సృష్టించిన భయం... భారత వైమానిక దళం ప్రదర్శించిన అద్భుతమైన నైపుణ్యం... భారత సైన్యం ధైర్యం... మూడు దళాల అద్భుతమైన సమన్వయం... ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌ను త్వరగా మోకరిల్లేలా చేసింది."





















